అన్వేషించండి

Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??

Idupu Kayitham Controversy: ఎక్స్ (ట్విట్టర్)లో తెలుగు ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అంటూ మాటలతో కొట్టుకుంటున్నారు. ఈ వివాదానికి 'ఇడుపు కాయితం' ఎలా కారణమైంది?

Idupu Kayitham Controversy Explained: 'ఎక్స్' (ట్విట్టర్)లో ఫ్యాన్ వార్స్ కామన్. ఓ హీరో అభిమానులు మరో హీరోపై దుమ్మెత్తి పోయడం సజహంగా జరిగేది. డై హార్డ్ ఫ్యాన్ వార్స్ నెటిజనులు కొత్త కాదు. కానీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ... అంటూ మాటలతో 'ట్విట్టర్ వార్' చేస్తున్నారు. దీనికి 'ఇడుపు కాయితం' కారణమైంది. మధ్యలో రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ కూడా మంటపై ఆజ్యం పోసినట్టు అయ్యింది. అదెలా? అసలు ఏమిటీ గొడవ? వంటి వివరాల్లోకి వెళితే...

'ఇడుపు కాయితం'పై నెటిజన్ కామెంట్...
ప్రాంతాల మధ్య గీత గీసిన మీనింగ్ ఇష్యూ!
ప్రియదర్శి, నాగదుర్గ జంటగా 'ఇడుపు కాయితం' సినిమా మొదలైంది. మొదట ఆ పదానికి అర్థం ఏమిటి? అనేది చాలా మంది ప్రేక్షకులకు తెలియలేదు. తెలంగాణ నేపథ్యంలో 'ఇడుపు కాయితం' తెరకెక్కుతోంది. అయితే... తెలంగాణలో చాలా మంది ప్రేక్షకులకూ ఆ టైటిల్ మీనింగ్ తెలియదు. దాంతో సెర్చ్ చేశారు. ఆ టైటిల్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ జరిగింది. మీనింగ్ తెలిశాక ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు సినిమాపై ఆసక్తి ఇంకొంచెం పెరిగింది. (ఇడుపు కాయితానికి ఇంకేం అర్థాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

Idupu Kayitham: ఆంధ్ర vs తెలంగాణ గొడవకు దారి తీసిన 'ఇడుపు కాయితం'... సబ్‌ టైటిల్స్‌ కావాలా? అసలేమిటీ చర్చ??
'సార్... తెలుగులో డబ్ చేస్తారా? లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అయితం ఆంధ్రోళ్ళం' అంటూ ట్వీట్ చేశాడు ఓ నెటిజన్. అతడి ట్వీట్‌పై తెలంగాణ ప్రాంత ప్రజలు భగ్గుమన్నారు. తమ యాస, మాండలికాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదని ట్వీట్లు చేశారు. ఆ తర్వాత దీన్ని ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవగా మార్చేశారు. ఈ మంటకు రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఆజ్యం పోయినట్టు అయ్యింది. ఎందుకంటే... 

ఇటీవల పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నలు గుప్పిస్తూ ఆయన ట్వీట్లు చేశారు. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు ఇష్యూను సైతం ఆంధ్ర వర్సెస్ తెలంగాణ గొడవగా కొందరు ప్రాజెక్ట్ చేయగా... పవన్ మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్ళలో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఇప్పుడు 'ఇడుపు కాయితం'పై ఆయన ట్వీట్ చేయడం వివాదాన్ని పెద్దది చేసినట్లు అయ్యింది.

తెలంగాణ యాసకు సబ్ టైటిల్స్ కావాలా?
ఆంధ్ర ప్రజలు తెలంగాణ సినిమాలు చూడలేరా?
'ఇడుపు కాయితం' వివాదానికి కారణమైన ట్వీట్ ఏమిటి? ''తెలుగులో డబ్బింగ్ చేస్తారా? సబ్ టైటిల్స్ వేస్తే హ్యాపీగా ఆంధ్ర వాళ్ళం హ్యాపీగా ఫీల్ అవుతాం'' అని! నిజంగా తెలంగాణ మాండలికం, యాసలో తెరకెక్కుతున్న సినిమాలకు ఆంధ్ర ప్రాంతంలో ఆదరణ లభించడం లేదా? తెలుగు చిత్రసీమలో ఆంధ్ర ప్రాంత పెద్దల నుంచి ప్రోత్సాహం లభించడం లేదా? అని ప్రశ్నించుకుంటే...

ఇడుపు కాయితానికి ముందూ తెలంగాణ నేపథ్యంలో సినిమాలు చేశారు ప్రియదర్శి. 'బలగం' సినిమా చూసి చిరంజీవి 'భోళా శంకర్' సెట్స్‌కు చిత్ర బృందాన్ని పిలిచి అభినందించారు చిరంజీవి. ప్రాంతాలకు అతీతంగా ఆ సినిమా ప్రశంసలు అందుకుంది. తెలంగాణ యాస, మాండలీకంపై ఎవరూ విమర్శలు చేయలేదు. అంత ఎందుకు? నాని హీరోగా నటించిన 'దసరా' కూడా తెలంగాణ నేపథ్యంలో చిత్రమే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలది తెలంగాణ కావచ్చు. కానీ, హీరో నాని ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన సినిమా చేశారు. ప్రేక్షకులు ఆదరించారు. తెలంగాణ యాసకు సబ్ టైటిల్స్ కావాలని ఆంధ్ర ప్రేక్షకులు ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. పైన చెప్పిన సినిమాలు సాధించిన విజయాలే అందుకు ఉదాహరణ.

Also ReadRavi Mohan Vs Kushboo - 'జయం' రవి కాపురంలో చిచ్చు పెట్టిందెవరు? ఖుష్బూ భుజాలు తడుముకోవడం ఎందుకు?

చిత్తూరు యాసలో తెరకెక్కిన 'పుష్ప', ఉత్తరాంధ్ర నేపథ్యంలో తీసిన 'పెద్ది'... ఆయా సినిమా విజయాలకు అడ్డు కాలేదు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ... ఏ కథకు అయినా సరే యాస సొగసు అద్దుతుంది. అంతే తప్ప విజయాన్ని అడ్డుకోలేదు. అంత ఎందుకు... 'ఇడుపు కాయితం' నిర్మాతలలో ఒకరైన బన్నీ వాస్ (Bunny Vas)ది పాలకొల్లు. కథ నచ్చడంతో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు.

మలయాళ, తమిళ్ సినిమాలు చూడట్లేదా?
సబ్ టైటిల్స్ వేస్తారా? అని నెటిజన్ చేసిన ట్వీట్ ముమ్మాటికీ తప్పే. తెలంగాణ యాసను ఆ విధంగా అగౌరవ పరిస్తే అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. మరో సందేహం అవసరం లేదు. కానీ, తెలుగు ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచిస్తారా? అనేది ఒక్క క్షణం ఆలోచిస్తే సమాధానం వస్తుంది. 

సూర్య తమిళ్ హిట్ 'కరుప్పు'ను తెలుగులో 'వీరభద్రుడు'గా డబ్బింగ్ చేశారు. కార్తీ 'వా వాతియార్'కు తెలుగులో 'అన్నగారు వొస్తారు' అని టైటిల్ పెట్టారు. ఆ రెండు సినిమాలు మినహాయిస్తే కొంత మంది మలయాళ, తమిళ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు సేమ్ టైటిల్స్‌తో డబ్బింగ్ చేశారు. ఉదాహరణకు... సూపర్ స్టార్ రజనీకాంత్ 'వెట్టయాన్', మోహన్ లాల్ 'ఎల్ 2 ఎంపురాన్', టోవినో థామస్ 'పళ్లి చట్టంబి' సినిమాలు సేమ్ టైటిల్స్‌తో విడుదల అయ్యాయి. ఈ లిస్టులో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. పేర్లతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళారు. కల్యాణీ ప్రియదర్శన్ 'లోక' సినిమాను 'కొత్త లోక'గా డబ్ చేస్తే... ఆ సినిమా తెలుగులో భారీ వసూళ్ళు సాధించింది.

Also Read: Inder Kaur Death Mystery - కాలువలో సింగర్ డెడ్ బాడీ... ఎవరీ ఇందర్ కౌర్? మర్డర్ చేసిందెవరు?

భాషతో సంబంధం లేకుండా ఇతర లాంగ్వేజ్ సినిమాలను సబ్ టైటిల్స్‌తో ఏపీ, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో మలయాళ, తమిళ సినిమాలు ఆయా భాషల్లో విడుదల అవుతుంటే హౌస్ ఫుల్స్ బోర్డులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఆయా భాషలు రాకున్నా సబ్ టైటిల్స్ ఉంటే చూస్తున్నారు కొందరు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్, కమెడియన్లకు తెలంగాణ యాస పెట్టేవారు. కానీ, ఇప్పుడు ఆ ధోరణి తగ్గింది. ఈ తరుణంలో తెలంగాణ మాండలికం - యాస వర్సెస్ ఆంధ్ర అంటూ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కొందరు ట్వీట్లు చేయడం సరికాదు. తెలంగాణ యాసను అంగీకరించలేని తెలుగు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే... వాళ్ళది తప్పే. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, వ్యూస్‌ కోసమో లేదా ఇతరత్రా ఆసక్తులతో, నారో మైండ్‌తో చేసే ట్వీట్‌లను రెండు ప్రాంతాలకు, ప్రజలకు, సినిమా ఇండస్ట్రీకి ఆపాదించి వివాదాలను పెంచడం సరికాదు.

Also ReadDisha Patani Success Story - బీటెక్ సెకండియర్‌లో కాలేజ్ మానేసి సినిమాల్లోకి... 500 నుంచి 5వేల కోట్లకు... దిశా పటాని సక్సెస్ వెనుక ఏం జరిగిందో తెలుసా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget