Inder Kaur: కాలువలో సింగర్ డెడ్ బాడీ... ఎవరీ ఇందర్ కౌర్? మర్డర్ చేసిందెవరు?
Inder Kaur Death Mystery: పంజాబ్‌లోని లూథియానాలో గాయని ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ మృతి సంచలనమైంది. అసలు ఎవరీ ఇందర్? ఆమె మరణం వెనుక మిస్టరీ ఎందుకు? అనేది తెలుసుకోండి.

- గాయని ఇందర్ కౌర్ అదృశ్యం, తర్వాత హత్యతో సంచలనం.
- ప్రేమ ప్రతిపాదన తిరస్కరణతో సుఖ్విందర్ హత్య చేశాడు.
- కాలువలో మృతదేహం లభ్యం, నిందితుడు దేశం విడిచి పారిపోయాడు.
- పోలీసుల ఆలస్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Who Is Inder Kaur?: పంజాబ్‌లో గాయని ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ మరణం (Inder Kaur Punjabi Singer Death) సంచలనం సృష్టించింది. మిస్సింగ్ కిడ్నాప్ కాస్త మృతి వరకు వెళ్లడంతో పోలీసులపై కౌర్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఎవరీ ఇందర్? ఆమె మరణం వెనుక ఎవరు ఉన్నారు? వంటివి తెలుసుకోండి.
వారం క్రితమే ఇందర్ కౌర్ మిస్సింగ్ కేసు!
Inder Kaur Missing Case: మే 13వ తేదీ సాయంత్రం సుమారు 8:30 గంటలకు తన ఫోర్డ్ ఫిగో కారులో నిత్యావసర వస్తువులు కొనేందుకు ఇందర్ కౌర్ వెళ్లారు. మళ్ళీ ఇంటికి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేయమని అడిగారు.
ఇందర్‌ను కిడ్నాప్ చేసిన సుఖ్విందర్?
ఇందర్ కౌర్ మిస్సింగ్ వెనుక సుఖ్విందర్ సింగ్ హస్తం ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అందుకు కారణం ఏమిటంటే... మోగా జిల్లా భలూర్ గ్రామానికి చెందిన వ్యక్తి సుఖ్విందర్ సింగ్. మూడేళ్ళ క్రితం ఇందర్ కౌర్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తర్వాత ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అయితే... సుఖ్విందర్‌కు ఆల్రెడీ పెళ్ళి అయ్యిందని, పిల్లలు ఉన్నారని ఇందర్ కౌర్‌కు తెలిసింది. దాంతో అతడిని దూరం పెట్టింది. మ్యారేజ్ ప్రపోజల్ తీసుకు వస్తే రిజెక్ట్ చేసింది.
ప్రేమను, పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని ఇందర్ కౌర్ మీద సుఖ్విందర్ కోపం పెంచుకున్నాడు. అనుచరులతో కలిసి మే 13న గన్ పాయింట్‌లో కిడ్నాప్ చేశాడు.
కాలువలో కనిపించిన కౌర్ మృతదేహం
మే 13వ తేదీన ఇందర్ కౌర్ ఇంటికి రాకపోవడంతో మే 15వ తేదీన పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆరు రోజుల పాటు కనిపించకుండా పోయిన ఆమె... చివరకు లుధియానాలోని ఓ కాలువలో విగత జీవిగా కనిపించింది. మృతదేహం లభ్యమైంది. ఆమెను సుఖ్విందర్ హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణలో... హత్య చేశాక నేపాల్ మీదుగా కెనడాకు పారిపోయినట్లు తేలింది.
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇందర్ కౌర్ ప్రాణాలు దక్కేవని, చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావడంతో ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పంజాబీ సంగీత ప్రపంచంలో యువ గాయని హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అభిమానులను, పంజాబీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇందర్ కౌర్ హిట్ సాంగ్స్ ఏమిటి?
Inder Kaur Hit Songs: ఇందర్ కౌర్ 1997లో జన్మించారు. అఫ్గాన్ జట్టి, సోహ్నా లగ్దా, లానేదార్ని, కిసాన్ ఆంథెమ్ పాటలతో పాపులర్ అయ్యారు. ఆమె గాయని మాత్రమే కాదు... మేకప్ ఆర్టిస్ట్ కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.25 లక్షల మంది ఫాలోవర్లు ఆమె అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.
Also Read: Opium: ఇండియాకు ఓపియం ఎలా వచ్చిందంటే? NTR Dragon Glimpseలో చూపించిన డ్రగ్ హిస్టరీ
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















