అన్వేషించండి

Idupu Kayitham: ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?

Idupu Kayitham Meaning: ప్రియదర్శి, నాగదుర్గ జంటగా 'ఇడుపు కాయితం' సినిమా మొదలైంది. ఆ టైటిల్ అర్థం ఏమిటి? అని సెర్చ్ చేసిన జనాలు ఉన్నారు. ఆ ట్రెండింగ్ వర్డ్ వెనుక హిస్టరీ తెలుసుకోండి.

Idupu Kayitham Meaning Explained: ఇడుపు కాయితం... ఇప్పుడీ పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ విధంగా రెండు ప్రాంతాలకు చెందిన కొందరు 'ట్విట్టర్ వార్'కు తెర తీశారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలు అయ్యింది? ఆ పదానికి అర్థం ఏమిటి? అనేది తెలుసుకుందాం రండి.

ప్రియదర్శి హీరోగా 'ఇడుపు కాయితం'
Priyadarshi Idupu Kayitham Movie: ఇటీవల ప్రియదర్శి కథానాయకుడిగా 'ఇడుపు కాయితం' మొదలైంది. ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆ సినిమా పూజకు హాజరయ్యారు. ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అల్లు అరవింద్, సుకుమార్, దిల్ రాజు వంటి ప్రముఖులు చిత్ర బృందాన్ని ఆశీర్వదించారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంస్థలపై బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ సినిమా పూజ తర్వాత 'ఇడుపు కాయితం' అంటే ఏమిటి? అనే ప్రశ్న మొదలైంది.

'ఇడుపు కాయితం' అంటే ఏమిటో తెలుసా?
What Is Idupu Kayitham?: 'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం. ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలంటే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే... కొన్నాళ్ళ క్రితం పెద్దల మధ్య పంచాయితీలు జరిగేవి. కలిసి బ్రతకలేమని నిర్ణయించుకున్న భార్యాభర్తలు... పెద్దల సమక్షంలో ఇరువురి కుటుంబ సభ్యులు హాజరు అవ్వగా విడిపోతున్నామని ఒప్పంద పత్రాలు రాసుకునేవాళ్ళు. వాటిని 'ఇడుపు కాయితం' అనేవాళ్ళు.

Also Read: Raaka Meaning - రాకా అంటే ఏమిటి? అల్లు అర్జున్ - అట్లీ సినిమా టైటిల్ మీనింగ్, బాలీవుడ్ & కామిక్ రిఫరెన్స్‌లు తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bunny Vas Works (@bvworksoffl)

'ఇడుపు కాయితం' అనేది తెలంగాణ పదం. స్పష్టంగా చెప్పాలంటే... మ్యూచువల్ డివోర్స్ అనొచ్చు. 'మా విడాకులు'ను పర్యాయ పదంగా కూడా పేర్కొనవచ్చు. వై?  ఎందుకు? అంటే ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు కనుక. ఇడుపు కాయితాన్ని 'సోడ్ చిట్టి', 'చోడ్ చిట్టి' అని కూడా పిలుస్తారు. అదీ సంగతి! ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో కొన్ని జంటలు కోర్టులను ఆశ్రయించకుండా... పెద్దల సమక్షంలో 'ఇడుపు కాయితం' రాసుకుని విడిపోతున్నారు. ఆంధ్రాలో కూడా ఈ తరహా సంప్రదాయం ఉంది. పెద్దల సమక్షంలో పేపర్స్ మీద సంతకాలు చేసి విడిపోతున్నారు.  

Also ReadPriyanka Rajakumaran: ఎవరీ ప్రియాంక? తమిళ తెరపైకి వారసురాలు... పవన్‌తో సినిమా చేసిన హీరోయిన్ కుమార్తె

తెలంగాణ మాండలికంలో 'ఇడుపు కాయితం' అనేది ఓ భాగం. అయితే... ఆంధ్ర ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు, తెలంగాణలో కొంత మందికి కూడా ఆ పదానికి అర్థం తెలియలేదు. అందుకని, ఎక్కువ మంది సెర్చ్ చేశారు. కొందరు అర్థం తెలిశాక... ఎవరికీ తెలియని పదాలను టైటిల్ పెట్టడం ఎందుకని కామెంట్స్ చేశారు. అది వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో ఎవరో కొందరు చేసిన కామెంట్స్ వల్ల రెండు ప్రాంతాల ప్రేక్షకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

Also ReadPolena Anjana Pawanova: అల్లు శిరీష్ పెళ్లిలో మెరిసిన అంజనా... పవన్ చిన్న కూతుర్ని చూశారా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Live Updates - 'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
'కొరియన్ కనకరాజు' లైవ్ అప్డేట్స్: హైదరాబాద్‌లో ప్రీమియర్స్ షురూ... స్పాయిలర్స్ లేకుండా సీన్ టు సీన్ మీ కోసం!
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
The Paradise Teaser : నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
నాని ది ప్యారడైజ్ టీజర్ - జడల్ జమానాలో కాకులు తల్వార్లు పడితే యాక్షన్ వేరే లెవల్...
The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Bold Series OTT : ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
ఒక్క ఫేక్ వీడియో... బలైన మహిళ జీవితం - ఓటీటీలో బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Embed widget