అన్వేషించండి

HYDRA: ప్రజలకు 'హైడ్రా' కమిషనర్ కీలక సూచన - కంప్లైంట్ చేయాలంటే ఈ నెంబర్లకు కాల్ చేయండి

Hyderabad News: ఇకపై ప్రతి సోమవారం ప్రజల నుంచి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ప్రజలు తగిన ఆధారాలు, వివరాలతో రావాలని సూచించారు.

HYDRA Commissioner Key Decision On Grievances: 'హైడ్రా' (HYDRA) కమిషనర్ రంగనాథ్ (Ranganath) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, తిరిగి 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేసే ముందు తగిన ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని సూచించారు. దీనికి సంబంధించి ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 040 - 29560596 నెంబర్లను సంప్రదించాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర

అటు, హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా ఇక్కడ 100 అడుగుల రోడ్డును ఆనుకొని 5 అంతస్తుల భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అక్కడకు వెళ్లి పరిశీలించగా.. 684 గజాల స్థలంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 5 అంతస్తుల్లో భవనం నిర్మాణంలో ఉంది. జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ అధికారులు ఇచ్చిన షోకాజ్ నోటీసులతో పాటు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భవనాన్ని నిర్మించడాన్ని రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. పూర్తి వివరాలు పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హైడ్రా వార్షిక నివేదిక హైలైట్స్ ఇవే..

కాగా, ఇటీవలే హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. 5 నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేసినట్లు  రంగనాథ్ తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం కింద ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఇచ్చిందని.. 12 చెరువులు, 8 పార్కులను అన్యాక్రాంతం కాకుండా రక్షించినట్లు చెప్పారు. 1,095 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్‌టీఎల్ నిర్దారణ చేస్తామని.. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు, బఫర్ జోన్లను నిర్ణయిస్తున్నామని పేర్కొన్నారు.

'త్వరలోనే ఎఫ్ఎం ఛానల్'

ఎఫ్‌టీఎల్‌ను పారదర్శకంగా చేయడం తమ బాధ్యతని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఎన్ఆర్ఎస్ఈతో సమన్వయం చేసుకుని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నామని.. ఏరియల్ డ్రోన్ చిత్రాలు సైతం తీసుకుంటామని చెప్పారు. శాటిలైట్ ఇమేజ్‌తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నామని.. ప్రభుత్వ భూములకు జియో ఫెన్సింగ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. చెరువులకు సంబంధించి 2000 నుంచి 2024 వరకూ ఉన్న చిత్రాలు సేకరిస్తున్నామన్నారు.

శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్‌టీఎల్ నిర్దారణ జరుగుతుందని రంగనాథ్ పేర్కొన్నారు. ఇప్పటివరకూ హైడ్రాకు 5,800 వరకూ ఫిర్యాదులు అందాయని.. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు కాపాడడమే హైడ్రా ప్రధాన కర్తవ్యమని.. భూముల రక్షణతో పాటు వరద నివారణ చర్యలు సైతం చేపడతామని అన్నారు. హైడ్రా తరఫున ఒక ఎఫ్ఎం ఛానల్ త్వరలోనే పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నామని.. దాని ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం తెలిపేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. హైడ్రా యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. 

Also Read: Telangana News: చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ - తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం; సిట్ ముందుకు నందకుమార్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసుల దిశగా అడుగులు!
Bhimavaram DSP Jayasurya transfer: పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
పవన్ ఫిర్యాదు చేసిన రెండు నెలలకు భీమవరం డీఎస్పీ బదిలీ - ఈ మధ్యలో ఏం జరిగింది?
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Bangladesh Bengali Language: ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ముస్లింలే కానీ బంగ్లాదేశ్‌లో ఎవరికీ ఉర్దూ రాదు- వారి భాష బెంగాలీనే - దేశం ఏర్పాటుకూ కారణం అదే !
ChatGPT vs Human Brain : ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
ప్రతి పనికి AI, ChatGPT ఉపయోగించే అలవాటు మానుకోండి.. లేదంటే మీ బ్రైయిన్ హాంఫట్
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
Embed widget