Zero Shadow Day: హైదరాబాద్‌లో నీడ మాయం !
Zero Shadow Day: హైదరాబాద్ లో ఈరోజు అద్భుతం జరగబోతోంది. నేడు మధ్యాహ్నం 12.12 గంల సమయంలో నీడ కనిపించదని.. ఆరోజు జీరో షాడో డే అని తెలుస్తోంది.

Zero Shadow Day: హైదరాబాద్ ఈరోజు అద్భుతం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం 12.12 గంటలకు రెండు నిమిషాల పాటు నీడ కనిపించదు. ఆ సమయంలో భాగ్యనగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. ఈరోజు ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా రెండు నిమిషాల పాటు కనిపిందు. 12.12 నుంచి 12.14 వరకు మీరు ఈ విషయాన్ని గమనించవచ్చు. ఏడాదిలో రెండు సార్లు జీరో షాడో డే ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ అంటే ఈరోజ, ఆగస్టు 3వ తేదీన కూడా జీరో షాడో డే ఏర్పడుతుంది. సమయంలో మార్పులతో దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఇలా నీడ మాయం అవుతుంది.
బిర్లా ప్లానిటోరియంలో అవగాహన
జీరో షాడో డే పైన అందరికీ అవగాహన కల్పించడానికి నగరంలోని బీఎం బిర్లా ప్లానిటోరియంలో శాస్త్రీయంగా జీరో షాడో డేను చూపించే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారు. ఒక తెల్లని ఉపరితలం లేదా పేపర్ పైన ఒక వస్తువును నిలబెట్టి మధ్యాహ్నం 12 నుంచి దాని నీడను గమనిస్తే సరిగ్గా 12.12 నిమిషాలకు అప్పటి వరకూ మార్పు చెందుతూ వస్తున్న ఆ వస్తువు నీడ కొన్ని క్షణాలు కనిపించదు. ఆ సమయంలో మన నీడు కూడా కనిపించదు. ఈ ప్రయోగాన్ని ఇంటి వద్ద కూడా చేసి నీడ కోల్పోవడాన్ని గమనించవచ్చు.
జీరో షాడో డే అంటే ఏంటి..?
Astronomical Society of India (ASI) చెబుతున్న వివరాల ప్రకారం...జీరో షాడో టైమ్‌లో ఏ వస్తువుపైన కానీ, మనిషిపైన కానీ సూర్యుడి కాంతి పడినా నీడ కనిపించదు. దీన్నే టెక్నికల్ పరిభాషలో జెనిత్ పొజిషన్ ( Zenith Position) అంటారు. ఈ కారణంగానే జీరో షాడో డే వస్తుంది. ఏటా రెండుసార్లు ఈ ఫినామినన్ జరుగుతుందని వెల్లడించింది. కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుంది. జీరో షాడో టైమ్‌లో సూర్యుడి అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యూడి కాంతి మనిషి పరిధిని దాటి పోలేదు. అందుకే కింద నీడ పడదు.
ఎందుకిలా జరుగుతుంది..?
సూర్యూడి చుట్టూ భూమి తిరిగే క్రమంలో రొటేషన్ యాక్సిస్ 23.5 డిగ్రీల మేర వంగిపోతుంది. ఈ క్రమంలోనే మన వాతావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. అంటే...కాంతి తీవ్రతలో మార్పు వస్తుంది. సూర్యుడు నట్ట నడి మధ్యకు వచ్చేశాడు..అందుకే ఇంతగా ఎండ మండుతోంది అనుకుంటాం. కానీ...సూర్యుడు కచ్చితంగా నడి నెత్తి మీదకు కేవలం రెండేసార్లు వస్తాడు. ఉత్తరాయణంలో ఓసారి, దక్షిణాయనంలో మరోసారి ఇవి జరుగుతాయి. అప్పుడు మాత్రమే కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేస్తాడు సూర్యుడు. దీన్నే జెనిత్ పాయింట్ అని పిలుస్తారు. ఇక టెక్నికల్‌గా చెప్పాలంటే సూర్యుడు మకరరాశి, కర్కాటక రాశి మధ్య +23.5,-23.5 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నప్పుడు ఈ వింత జరుగుతుంది. కరెక్ట్‌గా మధ్యలోకి వచ్చేయడం వల్ల సూర్య కిరణాలు స్ట్రెయిట్‌గా భూమిని తాకుతాయి. అందుకే మన నీడ కనిపించదు. భువనేశ్వర్, ముంబయి, హైదరాబాద్, బెంగళూరులో ఈ జీరో షాడో డే తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా రెప్ప పాటులోనే జరిగినప్పటికీ..దాని ప్రభావం మాత్రం దాదాపు నిముషం పాటు ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2021లో ఒడిశా, భువనేశ్వర్‌లో ఇలానే జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

