Yashwant Sinha at Begumpet Airport: యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్ ఘన స్వాగతం - బేగంపేట నుంచి జలవిహార్ వరకు TRS బైక్ ర్యాలీ
TRS Bike Rally From Begumpet to Jalavihar: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో యశ్వంత్ సిన్హాకు సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
Yashwant Sinha Arrives at Begumpet Airport: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంగపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బేగంపేటలో యశ్వంత్ సిన్హాకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, కాంగ్రెస్ నేత వీహెచ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుండి టీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్ ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దాంతో వీరు సైతం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి 10 వేల మందితో టీఆర్‌ఎస్ భారీ బైక్ ర్యాలీ జలవిహార్ వరకు చేరుకోనున్నారు.
జలవిహార్‌లో సభ..
రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ నేతలు జలవిహార్‌లో సభ నిర్వహిస్తున్నారు. బేగంపేట నుంచి బైక్ ర్యాలీతో కేసీఆర్, యశ్వంత్ సిన్హాలు జలవిహార్ చేరుకుంటారు. అనంతం అక్కడ నిర్వహించే సమావేశంలో మొదట కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతారు. జలవిహార్‌లో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ ముగిసిన తరువాత ఆయన గాంధీ భవన్‌కు వెళ్లనున్నారు. నగరంలో తన కార్యక్రమాలు ముగించుకుని నేటి సాయంత్రం హైదరాబాద్ నుండి బెంగళూరుకు బయలుదేరతారు. జలవిహార్‌లో సభ సక్సెస్ చేసేందుకు రాష్ట్ర మంత్రులు పనులను పర్యవేక్షించారు.
TRS President, CM Sri K Chandrashekar Rao received the opposition Presidential candidate Sri @YashwantSinha ji at the Begumpet Airport. TRS Working President Sri @KTRTRS, Ministers, MPs, MLAs, and other TRS leaders were also present. pic.twitter.com/NTNuEVfaV2
— TRS Party (@trspartyonline) July 2, 2022
ఇటీవల టీఎంసీకి రాజీనామా.. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటన
టీఎంసీ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హా సడెన్‌గా ఆ పదవికీ, పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను నిలబెడుతున్నట్లు కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా నామినేసన్ దాఖలు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా కేటీఆర్, లోక్‌సభలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేష్ రెడ్డి, వెంకటేశ్‌నేత, బీబీ పాటిల్, ప్రభాకర్ రెడ్డిలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
Live: TRS welcomes Presidential election candidate Sri @YashwantSinha ji https://t.co/PYLo2o1iEn
— TRS Party (@trspartyonline) July 2, 2022
సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించింది. ఇటీవల విపక్ష పార్టీ నేతలందరూ సమావేశమై యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓటేయాల్సిందిగా కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత పలువురు పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు. వారందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మద్దతు ప్రకటించాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ కూటమి అభ్యర్థిని ఓడించడమే లక్ష్యం కాబట్టి ఆ దిశగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: TRS Questions PM Modi: తెలంగాణలో కాలుపెట్టక ముందే ప్రధాని మోదీకి అధికార టీఆర్ఎస్ బిగ్ షాక్
Also Read: BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !