BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీలో అదిరిపోయే వంటకాలు, తెలంగాణ స్పెషల్ ఐటమ్స్‌తో మెనూ చూశారా !
BJP Plenary Food Menu: బీజేపీ ప్లీనరీతో ఓ వైపు రాజకీయాలు వేడెక్కుతుండగా... మరోవైపు వారి ఫుడ్ మెనూ నోరూరించేలా ఉంది. ముఖ్యంగా తెలంగాణ వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
Food Menu BJP national executive meeting in Hyderabad: తెలంగాణలోని హైదరాబాద్ వేదికగా బీజేపీ తమ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరగనున్న బీజేపీ ప్లీనరీకి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. జూలై 2,3 తేదీల్లో జరగబోయే బీజేపీ స్పెషల్ మీట్ లో స్పెషల్ మెనూను ఫైనల్ చేశారు. మధ్యాహ్నం భోజనంలో తెలంగాణ వంటకాలు ఉండేలా చూస్తున్నారు. పచ్చిపులుసు, పంటికూర పప్పు, గంగవాయిలి- మామిడి పప్పు, తెల్లజొన్న రొట్టెలు, బూందీలడ్డూను బీజేపీ ప్లీనరీ మెనూలో చేర్చారు. సాయంత్రం స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి, సకినాలు, గారెలు వడ్డించనున్నారు. ఇప్పటికే ఈ వంటల్లో కరీంనగర్ కు చెందిన యాదమ్మ ఆయా పరిసరాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగారన్నం లాంటి వంటలు.. గంగవాయిల కూర పప్పు, పచ్చి పులుసు, సాంబారు, గుత్తొంకాయ లాంటి కూరగాయలు, సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పు గారెలను జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అగ్రనేతలు రుచి చూడనున్నారు.
అటు వాడీవేడిగా రాజకీయాలు.. ఇటు తెలంగాణ ఘుమఘుమలు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగేది రెండు రోజులే అయినా పదాదికారులు, కార్యవర్గ సభ్యులతో అదనపు మీటింగుల దృష్ట్యా మొత్తం నాలుగు రోజులకు సరిపడేలా ఫుడ్ మెనూ తయారైంది. అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నందున ఆయా రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే హైదరాబాద్ బిర్యానీ (వెజ్), ధమ్ బిర్యానీ (అప్పటికప్పుడే వండేలా), భగారన్నం సర్వపిండి, మొక్కజొన్న వడ, సల్లచారు బజ్జీలు, పచ్చిపులుసు.. లాంటివి కూడా చేస్తున్నారు.
నాన్-వెజ్‌ను పూర్తిగా నిషేధించిన ఈ సమావేశాలు ‘నవరాత్రి’ వంటకాలలా ఉల్లి, వెల్లుల్లి లేకుండా రెడీ అవుతున్నాయి. జూలై 1 ఉదయం నుంచి 4వ తేదీ రాత్రి వరకు మొత్తం నాలుగు రోజుల పాటు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, మధ్యలో స్నాక్ టైమ్ కోసం వేర్వేరు మెనూలు సిద్ధమవుతున్నాయి. గుజరాతీ సమోసా మొదలు మొక్కజొన్న వడ, మద్రాసు సాంబార్ రోటి పచ్చడి, రాయలసీమ పల్లీ చట్నీ.. ఇవన్నీ మెనూల్లో ఉన్నాయి. ఏరోజు బ్రేక్ ఫాస్ట్ కు ఏది ఉంటుందో, లంచ్, డిన్నర్‌లకు ఏముంటుందో వేర్వేరు మెనూలను నోవాటెల్ హోటల్ ప్రిపేర్ చేసింది.
జూలై 1 .. మొదటి రోజు
బ్రేక్ ఫాస్ట్ : వెజిటబుల్ చీజ్ శాండ్‌విచ్, పావ్ వడ, క్యారట్ రొట్టె (ఆప్పం); టీ, కాఫీ, ఉస్మానియా బిస్కట్లు, కుకీలు
లంచ్ : పూర్తి వెజిటేరియన్ వంటలు
స్నాక్స్ : బ్రెడ్ పకోడా, కర్రీ పఫ్ (వెజ్), డ్రై ఫ్రూట్ టీ కేక్, కుకీలు, టీ, కాఫీ
డిన్నర్ : ఆలూ కుర్మా, మూంగ్ దాల్ టిక్కీ, పన్నీర్ టిక్కా, వెజిటబుల్ సలాడ్, ధోక్లా, ధనియా చాట్, పన్నీర్ కుట్టు, మునక్కాయ సాంబార్, భగారన్నం, తవా సబ్జి పలావ్, డబల్ కా మీఠా, బెల్లం జిలేబీ, ప్రూట్స్, ఉల్లి-వెల్లుల్లి లేని వంటలు
జూలై 2 : రెండో రోజు
బ్రేక్ ఫాస్ట్ : నల్లకారం పునుగులు, గుజరాతీ మినీ సమోసా, బనానా కేక్ స్లైస్, భకర్వాది
లంచ్ : వెజిటబుల్ సలాడ్, స్వీట్ సూప్, కాబూలీ చనా, ఆలూ మటర్, జోధ్‌పూర్ గటా కర్రీ, వంకాయ పకోడీ, అవియల్ (తమిళనాడు), దాల్ మక్నీ, దాల్ తడ్కా, మద్రాసు సాంబార్, పుల్లా-నాన్ రోటీ – తవా చపాతి – మకాయ్ రోటీ, మిల్లెట్ కిచిడీ, హైదారబాదీ వెజ్ బిర్యానీ (ధమ్ కూడా), ఉప్మా, ఊతప్పం, పెసరట్టు, పాలక్ దోశ, నవరాత్రి ఫుడ్
స్నాక్స్ : కారా బిస్కట్, ఫ్రూట్ బిస్కట్, మస్కా బన్, రస్కు, దిల్ ఖుష్, లుక్మి సమోసా, పట్టి సమోసా, వెజ్ కరీ పఫ్, హైదరాబాదీ ఇరానీ చాయ్
డిన్నర్ : హర బర కబాబ్ (వెజ్), చనా పాపడి చాట్, రష్యన్ సలాడ్, పిజ్జా ఢోక్లా, రోటి పచ్చడి, బగలా బాత్, చామగడ్డ ఫ్రై, ఉలవచారు, గోంగూర పప్పు, మద్రాసు సాంబార్, దహీ గుజియా, పానీపూరి, పన్నీర్ లిఫాఫా, చోలే కుల్చా, పావ్ బాజీ, ఎర్రకారంతో వెరైటీ దోశలు, రసమలాయ్, గుల్‌ఖండ్, కాజుహల్వా, శాబుదానీ కిచిడి
జూలై 3 : మూడవ రోజు
బ్రేక్ ఫాస్ట్ : అటుకులు, మొక్కజొన్న సమోసా, మైసూర్ పాక్, మొక్కజొన్న వడ లంచ్ : పుదీనా తులసి ఖీరా సలాడ్, గ్రీన్ సలాడ్, పెరుగు పునుగులు, సల్లచారు బజ్జీ, దోసకాయ పచ్చడి, రాయలసీమ పల్లీ-టమాట చట్నీ, ఆలుగడ్డ-మెంతికూర, మసాలా వంకాయ, జీడిపప్పు-బెండకాయ వేపుడు, పెసరపప్పు, భగారన్నం, పులిహోర, పచ్చిపులుసు, ముద్దపప్పు, పుదీనా రైస్, నువ్వుల లడ్డు, సేమియా పాయసం, నేతి భక్షాలు, అరిసెలు, జున్ను
స్నాక్స్ : పెసరపప్పు గారెలు, మిర్చి బజ్జీ, భార్వి పూరి (ఆలూ సబ్జి), పల్లీ పట్టి, వెజ్ బట్టర్ స్వీట్ కార్న్, సర్వపిండి, అరిసెలు, సఖినాలు, కోవా గర్జెలు
డిన్నర్ : దహీ కబాబ్, ధనియావాలి రాజ్‌మా, పన్నీర్ ధోక్లా, వడియాలు, మసాలా పన్నీర్ టిక్కా, కుంభ్ మలాయ్ పాలక్, కశ్మీరీ ధమ్ ఆలూ, పంజాబ్ కుఫ్తా, మసాలా రాజ్‌మా, జీరా పలావ్, జోల్ బిర్యానీ
జూలై 4 : నాలుగవ రోజు
బ్రేక్ ఫాస్ట్ : పన్నీర్ కట్టీ రోల్స్, ఆలూ టిక్కి, ఘాటియా
లంచ్ : నూడుల్ సలాడ్, ధమ్ బైంగన్, దాల్ బట్టి కుర్మా, ఆలూ గవార్ కి సబ్జీ, మేథీ చమన్, రాజస్థాన్ సుఖీ దాల్, గట్టా పలావ్, థాయ్ ఫ్రైడ్ రైస్, ఖుబానీ కా మీఠా, మూంగ్ దాల్ హల్వా, షాహీ తుక్‌డా