VC Sajjanar: చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకోవద్దు, బతికుండి పోరాడాలి: సజ్జనార్
VC Sajjanar: చిన్న చిన్న సమస్యలకే ప్రజలు ఆత్మహత్య చేసుకోవద్దని.. బతికుండి పోరాడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
VC Sajjanar: చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి ప్రజలు బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవని అన్నారు. కష్టాలు, సమస్యలను బతికుండి దైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అంతేకానీ క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకుని కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చవద్దని చెప్పుకొచ్చారు. ఇటీవలే హైదరాబాద్ లోని కొండాపూర్ లో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తీవ్ర గాయాలపాలైన అతడు.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ఇదే విషయాన్ని చెబుతూ.. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.
హైదరాబాద్ లోని కొండాపూర్ లో రెండు రోజుల క్రితం జరిగిందీ ఘటన. ఈ ప్రమాదంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. చిన్న చిన్న సమస్యలకే కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం. ఆత్మహత్య చేసుకున్నంతా మాత్రాన సమస్యలు ఎక్కడికి పోవు. కష్టాలు,… pic.twitter.com/9wxKn7sqpg
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 24, 2023
ఇటీవలే సిగ్నల్స్ వద్ద ఆత్రం వద్దంటూ ట్వీట్
సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏమాత్రం పనికి రాదని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో బైక్ పై వెళ్తున్న ఓ జంట సిగ్నల్ క్రాస్ చేయబోతుండగా.. లారీ కిందకు చొచ్చుకుపోయారు. అదృష్టవశాత్తు వారికి ఎలాంటి ప్రమాదమూ జరలేదు. అయితే ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కాగా... వీసీ సజ్జనార్ ట్టిట్టర్ ద్వారా నెటిజెన్లతో పంచుకున్నారు. అందరికి వీరిలా అదృష్టం ఉండదని.. సిగ్నల్స్ వద్ద ఏమాత్రం ఆత్రం పనికి రాదని వివరించారు. అలాగే రహదారులపై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించాలని సూచించారు. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణమై విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండని హితవు పలికారు.
ఎమన్నా అదృష్టమా ఇది!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 23, 2023
సిగ్నల్స్ వద్ద ఆత్రం ఏమాత్రం పనికిరాదు. అందరికీ వీరిలా అదృష్టం వరించదు. రహదారులపై లేన్ డ్రైవింగ్‌ను విధిగా పాటించండి. ఇలా అడ్డదిడ్డంగా వెళ్లి రోడ్డు ప్రమాదాలకు కారణమై విలువైన ప్రాణాలను పోగొట్టుకోకండి.#RoadSafety #RoadAccident @tsrtcmdoffice… pic.twitter.com/Bysa3hUV7d
రోడ్లపై వెళ్లేటప్పుడు పిల్లలు జాగ్రత్త: సజ్జనార్
రహదారుల వెంట పిల్లలను తీసుకెళ్లినప్పుడు.. తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పుకొచ్చారు. ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఓ పాప రోడ్డు దాటేందుకు పరిగెట్టగా.. బైక్ ఢీ కొడుతుంది. ఆ వెంటనే మరో బైక్ కూడా పాపను ఢీకొట్టింది. ఆమె అక్కడే పడిపోతుంది. ఈ విషయం గుర్తించిన ఆమె తల్లి వెళ్లి పాపను ఎత్తుకోగా.. కాసేపటికి ఆమె స్పృహలోకి వస్తుంది. అయితే అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం వరించదని చెబుతూ.. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వీసీ సజ్జనార్ వివరించారు.