అన్వేషించండి

Telangana SSC Results 2026: తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్! నేరుగా వాట్సాప్‌కే రీవెరిఫికేషన్ ఆన్సర్ షీట్స్‌!

తెలంగాణలో పదో  తరగతి విద్యార్థుల కోసం విద్యాశాఖ సరికొత్త సంస్కరణన తీసుకురానుంది. రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జవాబు పత్రాలను వాట్సాప్, మెయిల్‌కు పంపించనున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పదోతరగతి ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు డిజిటల్ వాల్యుయేషన్.
  • రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానం.
  • వాట్సాప్, ఈమెయిల్ ద్వారా నేరుగా విద్యార్థులకు జవాబు పత్రాల కాపీలు.
  • ప్రభుత్వ పరీక్షల విభాగం ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.

Telangana SSC Results 2026: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదోతరగతి ఫలితాలు అనంతరం విద్యార్థులు ఎదుర్కొనే ప్రధాన ఇబ్బందిని తొలగించే దిశగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఫలితాలు విడుదలైన  తర్వాత తమ మార్కులపై సంతృప్తిగా లేని విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. గతంలో ఈ ప్రక్రియ ఎంతో జాప్యంతో కూడుకుని ఉండేది. అయితే ఇప్పుడు ఈసారి ఆ కష్టాలకు స్వస్తి పలికి, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ డిజిటల్ వాల్యుయేషన్ పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. 

గతంలో రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్ కోరిన విద్యార్థులకు వారు రాసిన జవాబు పత్రాల జిరాక్స్‌ కాపీలను ప్రభుత్వం పోస్టల్ శాఖ ద్వారా పంపేది. ఈ ప్రక్రియలో పేపర్లను వెతకడం వాటిని ఫొటోకాపీ తీయడం, తిరిగి ప్యాక్ చేసి పంపడం వంటి పనుల వల్ల తీవ్రమైన ఆలస్యం జరిగేది. కానీ తాజా సంస్కరణల ప్రకారం, విద్యార్థి దరఖాస్తు చేసుకున్న తర్వాత వారి రిజిస్టర్డ్ మొబైల్‌ నంబర్ ఉన్న వాట్సాప్‌కు లేదా రిజిస్టర్‌ ఈ మెయిల్ అడ్రస్‌కు నేరుగా పంపిస్తారు. 

Also Read: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

గతంలో సప్లిమెటరీ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు కూడా చాలా మంది విద్యార్థులకు వారి రీ వెరిఫికేష్ పేపర్లు అందేవి కావు. దీని వల్ల వారు తమ తప్పును తెలుసుకునే అవకాశం ఉండేది. కాదు. వేలాది మంది విద్యార్థుల పేపర్లను జిరాక్స్ తీసి, పోస్టల్ ఛార్జీలు భరించడం ప్రభుత్వానికి భారంగా మారింది. డిజిటల్ పద్ధతి వల్ల ఈ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. పేపర్లు దారిలో పోవడం లేదా చిరిగిపోవడం వంటి సమస్యలు లేకుండా, విద్యార్థికి నేరుగా వారి కాపీ అందుతుంది. 

ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టక్ పీవీ శ్రీహరి వెల్లడించిన వివరాలు ప్రకారం, ఈ డిజిట్ సేవల కోసం విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ గడువు ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభించి డిజిటల్ కాపీలను పంపిస్తారు. 

Also Read: ప్రభుత్వ బడి ర్యాంక్ అదిరింది - కార్పొరేట్ శైలిలో విద్యాశాఖ ప్రచారం !

రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్ట్‌కు 500 రూపాయల ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో కేవలం మార్కుల కూడికలో తప్పులు ఉంటే సరి చేస్తారు. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్ట్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి. ఇందులో మార్కులు కూడికతోపాటు, ప్రతి ప్రశ్నకు మార్కులు వేశారా లేదా అని చెక్ చేస్తారు. రీ వెరిఫికేషన్ ఫలితాల కోసం ఎదురు చూడకుండానే సప్లిమెంటరీకి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక వేళ రీ వెరిఫికేషన్‌లో పాస్ అయితే సప్లిమెంటరీ అప్లికేషన్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని చెబుతున్నారు. 

Also Read: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 85. 25 శాతం ఉత్తీర్ణత! మరోసారి బాలికలదే పైచేయి!

ఈ రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 20 స్పాట్ కేంద్రాలను సిద్ధం చేశారు.  కేంద్రాల్లో అధికారులు ఆన్‌లైన్ పద్ధతిలోనే రీకౌంటింగ్, రీ వెరిఫకేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. వాల్యుయేషన్ పూర్తి అయిన వెంటనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఆటోమేటిక్‌గా విద్యార్థుల డిజిటల్ కాపీలను వారి వాట్సాప్, ఈ మెయిల్ ఐడీకి పంపిస్తారు. 

Also Read: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు

ఈ మధ్య విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 95.15 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇందులో బాలికలు పైచేయి సాధించారు. ఈసారి ఫలితాల్లో ములుగు జిల్లా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 99.30 శాతంతో రాష్ట్రంలోని టాప్‌లో నిలిచింది. హైదరాబాద్‌ జిలా 89.23 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉంది. అయితే 10/10 జీపీఏ సాధించి విద్యార్థుల సంఖ్య మాత్రం హైదరాబాద్ ప్రాంతాల్లోనే ఎక్కువగా వచ్చాయి. 

 

Frequently Asked Questions

తెలంగాణ SSC ఫలితాల తర్వాత విద్యార్థులకు ఎలాంటి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టారు?

తెలంగాణ విద్యాశాఖ మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థుల కోసం డిజిటల్ వాల్యుయేషన్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించింది.

డిజిటల్ వాల్యుయేషన్ వల్ల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా మారుతుంది?

ఇప్పుడు విద్యార్థుల జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను పోస్టల్ ద్వారా కాకుండా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్న వాట్సాప్ లేదా ఈమెయిల్ కు నేరుగా పంపిస్తారు.

రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు గడువు ఎప్పటి వరకు ఉంది?

విద్యార్థులు ఏప్రిల్ 30 నుంచి మే 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిసిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుంది.

రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం ఫీజు ఎంత?

రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్ట్కు 500 రూపాయలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్ట్కు 1000 రూపాయలు చెల్లించాలి.

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget