అన్వేషించండి

Telangana SSC Results 2026: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

TS 10th Class Results 2026 | తెలంగాణలో పదో తరగతి ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదలయ్యాయి. విద్యార్థులు bse.telangana.gov.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Telangana SSC Results 2026 |  హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) కార్యాలయంలో ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన వారిలో 95.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను వెల్లడిస్తారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bse.telangana.gov.in/ , https://results.bsetelangana.org/ లో డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,26,166 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం  95.15 శాతం మంది టెన్త్ విద్యార్థులు పాసయ్యారు. గత ఏడాదితో (92.78%) పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగయ్యాయి. 

వాట్సాప్‌లో Hi లని మెస్సేజ్ చేస్తే ఫలితాలు..
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చూసుకోవచ్చు. అంతేకాకుండా, ఈసారి సాంకేతికతను జోడిస్తూ వాట్సాప్‌లో కూడా ఫలితాలను పొందే వెసులుబాటు కల్పించారు. దీనికోసం అభ్యర్థులు 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం SSC Results లేక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అని కనిపిస్తే.. క్లిక్ చేసి, హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు
ఈ ఏడాది కూడా ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 96.26% గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 94.07% గా ఉంది. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రెగ్యులర్ అభ్యర్థుల పరంగా చూస్తే మొత్తం 5,16,815 మంది పరీక్ష రాయగా, అందులో 4,91,774 మంది పాస్ అయ్యారు.

ములుగు టాప్.. హైదరాబాద్ లాస్ట్
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే, ములుగు జిల్లా 99.30% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దురదృష్టవశాత్తూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా 89.23% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. విద్యాసంస్థల వారీగా చూస్తే, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 99.1% ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100% ఫలితాలను సాధించగా, 6 పాఠశాలలు మాత్రమే 0% ఫలితాలను నమోదు చేశాయి.

వాట్సాప్‌లోనే ఫలితాలు చెక్ చేసుకోండి.
- మీ ఫోన్లో 8096958096 సేవ్ చేసుకోండి.
- ఆపై మీ వాట్సాప్‌లో 8096958096కి  Hi అని పంపాలి
- తర్వాత  SSC Results  అని టైప్ చేసి హాల్‌టికెట్ నంబర్ ఎంటర్, వివరాలు చేయాలి. 
- హాల్ టికెట్ నెండర్, మీ వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే స్క్రీన్‌పై రిజల్ట్ కనిపిస్తుంది.
- మీ రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోవాలి. 

ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్  పూర్తి చేసి ముందుగానే ఫలితాలను సిద్ధం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Vaibhav Sooryavanshi News: వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆజ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
వైభవ్ సూర్యవంశీకి ప్ర‌మోష‌న్.. ఆ జ‌ట్టుకు  వైస్ కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్న 15 ఇయ‌ర్స్ కిడ్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
Embed widget