అన్వేషించండి

Nara Lokesh: కొడుకుతో పాటు తల్లి టెన్త్ పాస్.. చదువు ఆపేసిన వారికి లక్ష్మీ లహరి స్ఫూర్తి: నారా లోకేష్

Nara Lokesh Applauds Mother and Son Passing Tenth Class | తల్లీ కుమారుడు ఒకేసారి టెన్త్ క్లాస్ పాసయ్యారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మంత్రి నారా లోకేష్ వారిని అభినందించారు.

Nara Lokesh | అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి, ఆమె కుమారుడు విజయ్ ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తల్లి, కొడుకు ఇద్దరూ ఒకేసారి ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడం ఎంతో అద్భుతమైన విషయమని, వారి ఆనందాన్ని మాటలలో వర్ణించలేమని ఆయన తన ఎక్స్ వేదికగా కొనియాడారు. గృహిణిగా ఉంటూనే చదువుకోవాలనే పట్టుదలతో ఓపెన్ స్కూల్‌లో చేరి పరీక్షలు రాసిన లక్ష్మీ లహరి కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పరీక్షా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన ఆ కుటుంబంలో, తల్లి లక్ష్మీ లహరి 360 మార్కులు సాధించగా, కుమారుడు విజయ్ 562 మార్కులతో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆ కుటుంబంలో సంతోషాలు, వారిద్దరి సంబరాలను చూసి తాను ఎంతో ఆనందించానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తల్లికి అభినందనలు, కుమారుడికి ఆశీస్సులు తెలియజేస్తూ.. చిన్న చిన్న కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన ప్రతి ఒక్కరూ లక్ష్మీ లహరి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నారా లోకేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ ఏడాది 85.25 శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు ఏడాది పాటు పడిన కష్టానికి, వారికి విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్ల శ్రమకు ఈ ఫలితాలు నిదర్శనమని కొనియాడారు. కేవలం సాధారణ విద్యార్థుల ఫలితాలనే కాకుండా, ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలను కూడా అదే సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు.

గతంతో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో గణనీయమైన ప్రగతి సాధించామని మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మార్పుల సానుకూల ప్రభావం ఈ రిజల్ట్స్‌లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తం 85.25 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, గత ఏడాది ఇది 81.14 శాతంగా నమోదైంది. ఈసారి గతంతో పోలిస్తే దాదాపు 4 శాతం మేర ఉత్తీర్ణత పెరగడం విశేషం.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 87.90గా నమోదు కాగా, బాలురు 82.68 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని లోకేష్ తెలిపారు. గత ఏడాది 72.8 శాతంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత, ఈసారి ఏకంగా 78.39 శాతానికి పెరగడం ప్రభుత్వ కృషికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget