అన్వేషించండి

TS SSC Results 2026 District wise Results: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు

Telangana 10th Class Results | తెలంగాణలో టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలవగా, హైదరాబాద్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. అయితే జిల్లాల వారీగా ఫలితాల శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana 10th Class results 2026 | తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించగా.. అమ్మాయిలే పైచేయి సాధించారు. గత ఏడాదితో పోల్చితే రెండు శాతానికి ఈ ఏడాది ఫలితాల్లో రాష్ట్రంలోని గ్రామీణ జిల్లాలు అద్భుత ప్రదర్శన కనబరచగా, పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా రాజధాని జిల్లా వెనుకబడి పోయింది. ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఆ తర్వాతి స్థానాల్లో నాగర్ కర్నూల్ (99.03 శాతం), నిర్మల్ (98.96 శాతం), జగిత్యాల (98.87 శాతం) జిల్లాలు నిలిచి టాప్-4లో నిలిచాయి. అధికారిక వెబ్‌సైట్ https://results.bse.telangana.gov.in/ ,  https://results.bsetelangana.org/ లో విద్యార్థులు తమ రోల్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం విడుదల చేసిన అనుబంధ నివేదిక ప్రకారం.. మెజారిటీ జిల్లాలు 95 శాతానికి పైగా ఉత్తీర్ణతను సాధించాయి. మహబూబాబాద్ (98.81%), సంగారెడ్డి (98.69%), సూర్యాపేట (98.60%), కరీంనగర్ (98.57%), హన్మకొండ (98.56%), మరియు నల్గొండ (98.47%) జిల్లాలు టాప్-10 జాబితాలో నిలిచాయి. విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లా 91.25% ఉత్తీర్ణత సాధించగా, వికారాబాద్ (90.58%), భద్రాద్రి కొత్తగూడెం (89.23%) జిల్లాలు జాబితాలో కింది వరుసలో ఉన్నాయి.

తెలంగాణ పదో తరగతి ఫలితాలు - మార్చి 2026 (జిల్లాల వారీగా ఉత్తీర్ణత వివరాలు)

  జిల్లా పేరు హాజరైన విద్యార్థులు  ఉత్తీర్ణులైన వారు పాస్ శాతం
1 ములుగు 3287 3264 99.30
2 నాగర్ కర్నూల్ 10641 10538 99.03
3 నిర్మల్ 9743 9642 98.96
4 జగిత్యాల 12687 12544 98.87
5 మహబూబాబాద్ 8152 8055 98.81
6 సంగారెడ్డి 24573 24252 98.69
7 సూర్యాపేట 12351 12178 98.60
8 కరీంనగర్ 13137 12949 98.57
9 హన్మకొండ 12065 11891 98.56
10 నల్గొండ 19667 19366 98.47
11 జయశంకర్ భూపాలపల్లి 3541 3483 98.36
12 యాదాద్రి భువనగిరి 8918 8766 98.30
13 సిద్దిపేట 15325 14995 97.85
14 నారాయణపేట 8306 8125 97.82
15 రాజన్న సిరిసిల్ల 7310 7145 97.74
16 పెద్దపల్లి 7488 7316 97.70
17 జనగామ 6443 6292 97.66
18 కామారెడ్డి 13119 12787 97.47
19 వనపర్తి 7210 7027 97.46
20 మంచిర్యాల 9684 9413 97.20
21 ఆదిలాబాద్ 10875 10538 96.90
22 మెదక్ 11232 10853 96.63
23 వరంగల్ 9485 9034 95.25
24 మేడ్చల్ 48855 46531 95.24
25 ఖమ్మం 16958 16131 95.12
26 మహబూబ్ నగర్ 13199 12482 94.57
27 నిజామాబాద్ 24365 22961 94.24
28 కొమురం భీమ్ ఆసిఫాబాద్ 6932 6527 94.16
29 జోగులాంబ గద్వాల 8037 7549 93.93
30 రంగారెడ్డి 52946 49217 92.96
31 వికారాబాద్ 13482 12302 91.25
32 భద్రాద్రి కొత్తగూడెం 12703 11506 90.58
33 హైదరాబాద్ 74099 66115 89.23
  మొత్తం విద్యార్థులు 516815 491774 95.15

వెనుకబడిన హైదరాబాద్:
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది. ఇక్కడ మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 89.23% మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అన్ని జిల్లాల్లోనూ బాలుర కంటే బాలికలే అత్యుత్తమ ఫలితాలు సాధించడం విశేషం. మొత్తం మీద రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 95.15% గా నమోదైంది. ఈ గణాంకాలు ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైన చివరి 5 జిల్లాలు 

హైదరాబాద్ జిల్లా: 89.23% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో (33వ స్థానం) నిలిచింది. ఇక్కడ మొత్తం 74,099 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 66,115 మంది పాస్ అయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 90.58% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 32వ స్థానంలో ఉంది. ఇక్కడ 12,703 మందికి గాను 11,506 మంది ఉత్తీర్ణత సాధించారు.

వికారాబాద్ జిల్లా: 91.25% ఉత్తీర్ణతతో ఈ జిల్లా 31వ స్థానంలో నిలిచింది. మొత్తం 13,482 మంది విద్యార్థుల్లో 12,302 మంది ఉత్తీర్ణులు కావడంలో విజయం సాధించారు.

రంగారెడ్డి జిల్లా: 92.96% ఉత్తీర్ణతతో 30వ స్థానంలో నిలిచింది. ఇక్కడ రాష్ట్రంలోనే రెండో అత్యధిక సంఖ్యలో (52,946 మంది) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

జోగులాంబ గద్వాల జిల్లా: 93.93% ఉత్తీర్ణతతో జాబితాలో కింద నుండి ఐదవ స్థానంలో అంటే 29వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 8,037 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 7,549 మంది పాస్ అయ్యారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌వే భోగాపురం ఎయిర్ పోర్ట్: ప్రధాని మోదీ
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget