అన్వేషించండి

Andhra Pradesh Government Schools: ప్రభుత్వ బడి ర్యాంక్ అదిరింది - కార్పొరేట్ శైలిలో విద్యాశాఖ ప్రచారం !

government schools: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకు పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. ఆ వివరాలను కార్పొరేట్ స్కూల్స్ స్టైల్లో పత్రికలలోనూ ప్రకటించారు.

AP Government Announcements: ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ మారుతున్న తీరుకు అద్దం పడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విజయాలు ఇప్పుడు వార్తా పత్రికల్లో ప్రముఖంగా కనిపిస్తున్నాయి.  సాధారణంగా పదో తరగతి లేదా ఇంటర్ ఫలితాలు రాగానే పత్రికల నిండా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల ప్రకటనలే కనిపిస్తాయి. స్టేట్ ఫస్ట్ మాదే.. టాప్ ర్యాంకులు మావే  అంటూ భారీ కలర్ అడ్వర్టైజ్‌మెంట్లతో ఆ సంస్థలు హోరెత్తిస్తుంటాయి. కానీ, ఏపీలో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో విద్యాశాఖ ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడి పిల్లలు సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం విద్యా రంగంలో ఒక వినూత్న మార్పుగా నిలుస్తోంది.

ప్రైవేటు స్కూళ్లతో  ప్రభుత్వ స్కూళ్లు పోటీ

ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం పేద విద్యార్థులు చదువుకునే చోటు మాత్రమే కాదని, అక్కడ కూడా అత్యుత్తమ విద్యాబోధన అందుతుందని ఈ ప్రకటనలు నిరూపిస్తున్నాయి. భారీ మార్కులు, ర్యాంకులు కేవలం ఏసీ గదుల్లో చదివితేనే రావు.. నిబద్ధత గల ఉపాధ్యాయులు, మెరుగైన వసతులు ఉంటే ప్రభుత్వ బడిలోనూ స్టేట్ టాపర్స్  తయారవుతారని విద్యాశాఖ ఈ ప్రచారంతో స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా, సామాన్య ప్రజల్లో ప్రభుత్వ విద్యావ్యవస్థపై ఉన్న చిన్నచూపును తొలగించి, నమ్మకాన్ని పెంపొందించడానికి ఇవి దోహదపడుతున్నాయి. గతంలో ప్రైవేటు స్కూళ్లలో మార్కులు రావడానికి కారణం వారి విద్యా విధానమే అన్న భ్రమలో తల్లిదండ్రులు ఉండేవారు. కానీ, నేడు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతులు, మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల కృషి ఫలితంగా మార్కులు వస్తున్నాయని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. తమ పిల్లల ఫోటోలను ఇలా అధికారిక ప్రకటనల్లో చూసుకోవడం ఆ తల్లిదండ్రులకు జీవితకాలపు గర్వకారణంగా మారుతోంది. ఇది ఇతర విద్యార్థుల్లో కూడా పోటీ తత్వాన్ని, తాము కూడా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

ప్రభుత్వ ప్రయత్నానికి ప్రశంసలు

ఈ ప్రయత్నం కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాకుండా, ఒక సామాజిక మార్పుకు నాంది పలుకుతోంది. ప్రైవేటు సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ బడులే శరణ్యమని భావించేలా చేస్తోంది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మేధావులు, విద్యావేత్తల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. కేవలం అధికారుల మీదనే ఫోకస్ పెట్టకుండా, క్షేత్రస్థాయిలో విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహించినట్లు అయింది.

విద్యాశాఖలో సమూల సంస్కరణలు

ఆడంబరాలకు పోకుండా నిజమైన ప్రతిభను గుర్తించి, మా విద్యార్థులు కూడా ఎవరికీ తీసిపోరు అని ప్రభుత్వం చాటిచెప్పడం విద్యా రంగంలో ఒక గొప్ప మలుపు. ప్రైవేటు పాఠశాలల ప్రకటనల హోరులో ప్రభుత్వ స్కూళ్ల విజయగాధలు మరుగున పడిపోకుండా చూడటమే కాకుండా, సామాన్యుడికి నాణ్యమైన విద్యపై భరోసా కల్పించడంలో ఈ ఫుల్ పేజీ ప్రకటనలు విజయవంతమయ్యాయి. ఈ బాటలోనే మరిన్ని సంస్కరణలు వస్తే, భవిష్యత్తులో ప్రభుత్వ బడులే విద్యా కేంద్రాలుగా విరాజిల్లడం ఖాయం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
YS Jagan On TET Exam: టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
టీచర్ల టెట్ నిబంధనలపై జగన్ ఫైర్! చంద్రబాబు తీరుపై మండిపడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత ఘాటు ట్వీట్!
Breaking News: ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది, భవిష్యత్తులో చర్చలు జరపం: ట్రంప్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసింది, భవిష్యత్తులో చర్చలు జరపం: ట్రంప్
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Swathi Wedding: దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
దర్శకుడితో స్వాతి పెళ్ళి... కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా
Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Hybrid SUV Range: 1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
1200 కిలోమీటర్ల రేంజ్, త్వరలో లాంచ్ కానున్న 3 హైబ్రిడ్ SUVలు
US Iran News: ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
ఇరాన్ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన! పాకిస్థాన్ మధ్యవర్తిత్వం విఫలం!  
Embed widget