అన్వేషించండి

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి మార్క్‌షీట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఫలితాలు చూడటానికి ఉన్న మార్గాలేంటీ?

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఎలా చూడొచ్చో తెలుసుకుందాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల.
  • 6.4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో.
  • ఫలితాలు వెబ్సైట్, డిజిలాకర్, వాట్సాప్, SMS ద్వారా తెలుసుకోవచ్చు.
  • రీకౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్షల వివరాలు కూడా విడుదల చేయబడ్డాయి.

AP SSC Exam Results 2026: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇందులో 6.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ముగిసిన తక్కువ కాలంలోనే జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి పారదర్శకంగా ఫలితాలను చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ ద్వారా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల అవుతాయి. మంత్రి నారా లోకేష్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలు వెల్లడిస్తూ, ఫలితాలు విడుదల రం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా తమ లాగిన్‌ల ద్వారా విద్యార్థుల ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఫలితాల కోసం bse.ap.gov.in, results.bse.ap.gov.inలలో చూడవచ్చు. 

ఫలితాలు ఎలా చూడాలి 

విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం, విద్యాశాఖ పలు మార్గాల్లో ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. భారీ ట్రాఫిక్ వల్ల వెబ్‌సైట్లు మొరాయిస్తాయని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. ముందుగా bse.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్‌పేజీలో కనిపించే AP SSC Results March 2026 లింక్‌పై చేయాలి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, అవసరమైతే పుట్టిన తేదీని నమోదు చేయాలి. సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మార్కుల మమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం దీనిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

Also Read: రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

డిజీలాకర్‌లో ఫలితాలు

ప్రభుత్వం ధ్రువీకరించిన డిజిట్‌ మార్క్ ీట్ కోసం డిజిలాకర్‌‌ ఉత్తమమైన మార్గం. డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా మొబైల్‌ యాప్‌ ఓపెన్ చేయాలి. ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వాలి. తర్వాత ఎడ్యుకేషన్ సెక్షన్‌లోకి వెళ్లాలి. BSEAP లేదా ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎస్‌సీ ఆప్షన్ ఎంచుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ సంవ్సరం నమోదు చేస్తే మార్క్ షీట్ కనిపిస్తుంది. 

వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకోవడం ఎలా 

గత ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు విడుదల చేస్తోంది. 9552300009 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. మీ వాట్సాప్ నెంబర్ నుంచి ఆ నెంబర్‌కు హాయ అని మెసేజ్ చేస్తే అందులో మెను వస్తుంది. అందులో ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌  ఉంటుంది. అందులో ఎస్సెస్సీ రిజల్ట్స్ అని కనిపిస్తుంది. అక్కడ మీ హాల్‌టికెట్ నెంబర్ టైప్ చేయాలి. వెంటనే మీ పదోతరగతి ఫలితం మీ వాట్సాప్‌ నెంబర్‌కు వచ్చేస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలి. 

Also Read: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ములుగు జిల్లాటాప్, చివరి స్థానంలో హైదరాబాద్.. జిల్లాలవారీగా ఫలితాలు

ఇంటర్‌నెట్‌ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎస్‌ఎంఎస్‌లో ఫలితాలు 

ఇంటర్‌నెట్‌ సరిగా లేని ప్రాంతాల్లో విద్యార్థులకు సులభంగా ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించింది ప్రభుత్వం. నేరుగా ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు టెక్ట్ మెసేజే ఫార్మాట్‌లో మీ ఎస్సెస్సీ రోల్ నెంబర్ టైప్ చేసి 56300 లేదా 55352 నెంబర్‌కు పంపించాలి. తర్వాత మీకు ఫలితాలు మీ ఫోన్‌కు మెసేజ్ రూపంలో వస్తుంది. 

ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాశారు

2026లో మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇందులో 6,22,074 మంది విద్యార్థులు రెగ్యులర్‌గా పరీక్షకు హాజరయ్యారు.18,842 మంది ప్రైవేట్ విద్యార్థులు. బాలురు 3,28,652 బాలికలు 3,12,264 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 

గత ఏడాది ఫలితాలు పరిశీలిస్తే 81.14 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో బాలికలు 84.09 శాతం అయితే బాలురు 78.31 శాతం. ఈ ఏడాది కూడా బాలికలే ఎక్కువ మంది ఉన్నందున వారిదే పై చేయి ఉంటుందని అంటున్నారు.

రీకౌంటింగ్, సప్లిమెంటరీ

ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు బోర్డు రీవాల్యుయేషన్‌ , రీ కౌంటింగ్‌కు రిక్వస్ట్ పెట్టుకోవచ్చు. రీ కౌంటింగ్‌కు ఒక సబ్జెక్ట్‌కు ఐదు వందల రూపాయలు చెల్లించాలి. అదే రీ వెరిఫికేషన్ లేదా రీ వాల్యుయేషన్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి. 

పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం జూన్ నెలలో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం వృథా కాకుండా చూసుకోవచ్చు. 

Frequently Asked Questions

AP SSC 2026 పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?

AP SSC 2026 పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ప్రకటించారు.

AP SSC 2026 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

ఫలితాలను bse.ap.gov.in, results.bse.ap.gov.in వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు.

డిజిలాకర్‌లో AP SSC 2026 ఫలితాలను ఎలా పొందవచ్చు?

డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఆధార్‌తో లాగిన్ అయి, BSEAP ఆప్షన్‌ను ఎంచుకొని హాల్ టికెట్ నెంబర్, సంవత్సరం నమోదు చేస్తే మార్క్‌షీట్‌ను చూడవచ్చు.

వాట్సాప్ ద్వారా AP SSC 2026 ఫలితాలను తెలుసుకోవడం ఎలా?

9552300009 నెంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ చేసి, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లోని SSC ఫలితాల ఆప్షన్‌లో హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే ఫలితం వస్తుంది.

ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు ఏమి చేయాలి?

ఫలితాల పట్ల సంతృప్తి చెందని విద్యార్థులు రీకౌంటింగ్ (ఒక సబ్జెక్ట్‌కు రూ.500) లేదా రీవాల్యుయేషన్ (రూ.1000) కోసం బోర్డును సంప్రదించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget