అన్వేషించండి

Allu Arjun: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలలో జాప్యం, పోలీసుల కీలక ప్రకటన

Allu Arjun Will be released on 14th December | పుష్ప 2 హీరో అల్లు అర్జున్ కు బెయిల్ లభించినా, అనంతరం ప్రక్రియలో జాప్యం జరగడంతో శుక్రవారం రాత్రి ఆయన చంచల్ గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

Allu Arjun in Chanchalguda Jail | హైదరాబాద్: టాలీవుడ్ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంపై సస్పెన్స్ వీడింది. ఆయన శుక్రవారం రాత్రి విడుదల కావడం లేదని కన్ఫామ్ అయింది. శనివారం  ఉదయం 6 గంటల తర్వాత ఏక్షణంలోనైనా అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదల కానున్నారు. బెయిల్ ఆర్డర్ కాపీ రావడం ఆలస్యం కావడంతో విడుదలలో జాప్యం జరిగిందని జైలు సూపరిటెండెంట్ అధికారికంగా నిర్ధారించారు. దాంతో చంచల్ గూడ జైల్లోని మంజీరా బ్యారక్ లోనే అల్లు అర్జున్ ఉండనున్నారు. ఈరోజు రాత్రికి అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్లోనే ఉండనున్నారని పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ రాత్రికి విడుదల అవుతారని పెద్ద ఎత్తున ఫ్యాన్స్ జైలు వద్దకు చేరుకున్నారు.


Allu Arjun: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలలో జాప్యం, పోలీసుల కీలక ప్రకటన

తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట

నటుడు అల్లు అర్జున్‌‌కు తెలంగాణ హైకోర్టులో శుక్రవారం సాయంత్రం ఊరట లభించింది. పుష్ప 2 నటుడికి హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పూచీకత్తు బాండ్లు తీసుకుని అల్లు అర్జున్ లాయర్లు చంచల్‌గూడ జైలుకు వచ్చినా ప్రక్రియ పూర్తి కాలేదు. సాయంత్రం నుంచి అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ పేపర్లు చంచల్ గూడకు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూశారు. మొదట లాయర్లు సమర్పించిన పేపర్లలో కొన్ని తప్పిదాలు దొర్లడంతో వాటిని జైలు అధికారులు తోసిపుచ్చారు. మరోవైపు కోర్టు నుంచి బెయిల్ కాపీ జైలు సూపరింటెండ్ కు చేరడంలో జాప్యం జరిగింది. కానీ పూచీకత్తు సమర్పించే ప్రక్రియ, బెయిల్ ఆర్డర్ పత్రాలు, సంబంధిత కాపీ ఇవ్వడంలో జాప్యం జరగడంతో అల్లు అర్జున్ విడుదల ఆలస్యమైంది. జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల ప్రక్రియ రేపటికి వాయిదా పడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయిన అల్లు అరవింద్
తన కుమారుడు అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించడంతో రాత్రిలోగా జైలు నుంచి విడుదల అవుతారని నటుడి తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భావించారు. కానీ సాయంత్రం నుంచి ఎంత ప్రయత్నించినా, కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ కాపీ జైలుకు అందడంతో జాప్యం జరిగింది. పూచీకత్తు సమర్పించడానికి వచ్చిన లాయర్లు ఇచ్చిన పత్రాలలో తప్పిదాలు ఉన్నాయని జైలు సూపరింటెండ్ సూచించినట్లు సమాచారం. దాంతో మరోసారి పత్రాలు తీసుకువచ్చిన అల్లు అర్జున్ లాయర్లు జైలు అధికారులకు సమర్పించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని గ్రహించిన ఆయన తండ్రి అల్లు అరవింద్ తీవ్ర నిరాశ చెందారు. వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని తన నివాసానికి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కోసం సాయంత్రం నుంచి ఎదురుచూసిన ఆయన కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు.


Allu Arjun: జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలలో జాప్యం, పోలీసుల కీలక ప్రకటన

చంచల్ గూడ జైలుకు తరలివస్తున్న బన్నీ ఫ్యాన్స్
నాంపల్లి కోర్టు శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌కు రెండు వారాల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. సాయంత్రం నుంచి చంచల్ గూడ జైలుకు బన్నీ ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు. రాత్రివేళ అల్లు అర్జున్ విడుదల కానున్నారని భావించి భారీ సంఖ్యలో జైలు వద్దకు తరలి వస్తున్నారు. కానీ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల రేపటికి వాయిదా పడింది. మరోవైపు హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ కు ధర్మాసనం ఓకే చేసింది. మరోవైపు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను జనవరి 21కి వాయిదా వేసింది.   

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Private Schools Fee: ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల వివరాలు ప్రదర్శించాలి: విద్యాశాఖ కీలక ఆదేశాలు
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget