అన్వేషించండి

Komatireddy: రేవంత్ పెద్ద తప్పు చేశారు, ఇక ఆయన ముఖం చూడను - కోమటిరెడ్డి సంచలన కామెంట్స్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని అన్నారు.

Komatireddy Venkat Reddy: ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరుతుండడం.. తాజాగా తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపకుడు చెరుకు సుధాకర్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవడం వంటి పరిణామాలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. ఒకప్పుడు తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. చెరుకు సుధాకర్ ను చేర్చుకునే విషయంలో రేవంత్‌ రెడ్డి పెద్ద తప్పు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆయన ముఖం చేసేది లేదని తేల్చి చెప్పారు. 

పార్లమెంట్‌ సమావేశాల తర్వాత మునుగోడుకు వెళ్తానని స్పష్టం చేశారు. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీన‌మైంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్యస‌భ‌లో ప్రతిప‌క్ష నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స‌మ‌క్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాక‌ర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇంటిపార్టీని విలీనం చేరారు. ఈ కార్యక్రమంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు బ‌త్తుల సోమ‌య్య, సందీప్ చ‌మార్, కాంగ్రెస్ నాయ‌కుడు స‌త్తు మ‌ల్లేష్ పాల్గొన్నారు.

ఎంపీ కోమటిరెడ్డి తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ ద్వారా వివరించారు. అయితే రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భంగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తనకు క్షమాపణ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్‌ చేశారు.

రేవంత్ రెడ్డి వివరణ ఏంటంటే..

కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో పాటు తనను కూడా బ్రాందీ షాపుల్లో పని చేసుకునేవారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారని ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలన్న వెంకటరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు.  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేరే.. రాజగోపాల్‌రెడ్డి వేరు.. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని రేవంత్ ప్రకటించారు.  రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి అన్నారు.  వెంకట్ రెడ్డికి వివరణ ఇస్తున్నా.. రాజగోపాల్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వెంకట్ రెడ్డికి సంబంధంలేదు.. వెంకన్న మా వాడేనని ప్రకటించారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరూ తనను టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నా.. పార్టీ వీడిపోయే వరకూ రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలోనూ రేవంత్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆయన విషయంలో తన వైపు తప్పు లేకుండా చూసుకుంటున్నారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. వెంకటరెడ్డి తమతో టచ్‌లో ఉన్నాడని నేరుగా తెలంగామ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. బండి సంజయ్‌ను వెంకటరెడ్డి పల్లెత్తు మాట అనకపోగా.. పార్టీ మారుతారా అని అడుగుతూంటే..  ఖండించేందుకు కూడా సిద్ధపడటం లేదు. ఈ అంశం ఢిల్లీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. తాము పుట్టిందే కాంగ్రెస్‌లో అని చెబుతున్నారు కానీ పార్టీని వీడబోమని చెప్పడం లేదు. ఈ అంశమే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్‌లో అనేక సందేహాలకు కారణం అవుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Embed widget