అన్వేషించండి

KTR Counter: కారు స్టీరింగ్ మాచేతుల్లోనే, బీజేపీది మాత్రం ఆదానీ చేతుల్లో - అమిత్‌షాకు కేటీఆర్ కౌంటర్

అబద్దాల అమిత్‌షా పార్టీకి రాష్ట్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా బహిరంగ సభలో చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు వచ్చి ప్రధాని మోదీ, అమిత్‌ షా ఎన్ని అబద్ధాలు చెప్పినా.. బీజేపీకి ఇక్కడ ఓటమి తప్పదని అన్నారు. అబద్దాల అమిత్‌షా పార్టీకి రాష్ట్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. అమిత్‌ షా ప్రసంగం అంతా అబద్దాలే అని.. తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ బీజేపీకి అన్ని స్థానాల్లో డిపాజిట్‌ గల్లంతు ఖాయమని అన్నారు. పరివార్‌ వాద్‌ అంటూ అమిత్‌ షా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. 

ఏ క్రికెట్‌ కప్‌ సాధించారని అమిత్ షా కుమారుడు జై షా క్రికెట్ బోర్డు పదవిలో ఉన్నారని నిలదీశారు. అసలు అమిత్‌ షా కుమారుడు ఎప్పుడు క్రికెట్ ఆడారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత పది సంవత్సరాల్లో తెలంగాణకు బీజేపీ ఒక్క విద్యా సంస్థను కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు చెల్లబోవని అన్నారు. రైతుల ఆత్మల్లో తెలంగాణ అగ్రస్థానమని అమిత్‌ షా చెప్పిన మాటలు అవాస్తవమని అన్నారు. రైతు సంక్షేమం దేశంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని అన్నారు. సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను పునరుద్ధరిస్తామని.. గత ఐదేళ్ల కిందట ఆదిలాబాద్‌ సభలో అమిత్‌ షా ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

మా స్టీరింగ్ మా చేతుల్లోనే
‘‘పరివార్‌ వాద్‌ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్‌ షా కుమారుడు క్రికెట్‌ ఎప్పుడు ఆడారో స్పష్టం చేయాలి. ఆయనకి బీసీసీఐలో ఎలా స్థానం కల్పిస్తారు. కేంద్రం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు. అమిత్ షా అన్నట్లుగా మజ్లిస్ చేతిలో మా స్టీరింగ్‌ లేదు. మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది. కానీ, బీజేపీ స్టీరింగ్‌ అదానీ చేతుల్లో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానమన్న అమిత్‌ షా వ్యాఖ్యలు అసత్యం. రైతు సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆదిలాబాద్‌ సీసీఐ ప్రారంభానికి ఐదేళ్ల క్రితం అమిత్‌ షా ఇచ్చిన హామీకి ఎలాంటి కదలికా లేదు’’ అని కేటీఆర్‌ విమర్శలు చేశారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా లేని ప్రభుత్వం బీజేపీ అని.. బీజేపీ కేంద్రంలో ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టమని అన్నారు. యూనివర్సిటీకి భూమి కేటాయించలేదనేది పూర్తిగా అబద్ధమని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ విద్యాలయం, కేజీబీవీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అదానీ గురించి మాట్లాడమంటే ప్రధాని ఎందుకు నోరు ఎత్తరని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Gangavva: చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?
చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?
TDP: ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
ఎన్నికలకు ముందు విజయమ్మ అమెరికా పర్యటన సీక్రెట్ ఇదే - టీడీపీ సంచలనం
Srisailam Tour Package: కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
కొండల మధ్య కృష్ణమ్మ ప్రవాహంలో లాంచీ ప్ర‌యాణం షురూ - టికెట్ల ధరలు ఇలా
Embed widget