News
News
X

KTR: బీజేపీ ఆ పని చేస్తే మునుగోడులో పోటీ చెయ్యం! చంద్రబాబు, వైఎస్సే నయం - కేటీఆర్

Telangana Bhavan లో మంగళవారం టీఆర్ఎస్‌వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల స‌మావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ప్రసంగించారు.

FOLLOW US: 

Minister KTR Comments: టీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం ఉప్పొంగడం చూస్తుంటే మునుగోడులో బ‌రాబ‌ర్ గెలుస్తామ‌నే విశ్వాసం క‌లిగిందని ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఉద్యమాల్లో రాటుదేలారని అన్నారు. అందులోనూ విద్యార్థి నాయ‌కులు బాగా పని చేశారని కొనియాడారు. ఎన్నిక‌ల గురించి, పోరాటాల గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మంగళవారం టీఆర్ఎస్‌వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల స‌మావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ ప్రసంగించారు. 

మునుగోడు ఎన్నికల గురించి మాట్లాడుతూ.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి బీజేపీ రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను క‌ట్టబ‌ట్టిందని, అందుకే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీలోకి వెళ్లారని అన్నారు. ఆయనకు రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లుగానే తమ న‌ల్గొండ జిల్లా అభివృద్ధికి కూడా ఆ స్థాయిలో నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే పోటీ నుంచి త‌ప్పుకుంటామ‌ని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఈ విష‌యంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా క‌ట్టుబ‌డి ఉంటాన‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

‘‘మునుగోడు ఉప ఎన్నిక కేవ‌లం ఒక్క కార‌ణంతోనే వ‌చ్చింది. ఒక కాంట్రాక్టర్ బ‌లుపు వల్లనే వ‌చ్చింది. రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి, ఆయ‌న‌ను కొనేసి, అవ‌స‌ర‌మైతే రూ.500 కోట్లు ఖ‌ర్చు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. మునుగోడు ప్రజ‌లను అంగ‌డి స‌రుకులా కొంటాన‌ని న‌రేంద్ర మోదీ అహ‌కారం ప్రద‌ర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్రజ‌ల ఆత్మగౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న ఎన్నికే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్పష్టం చేశారు.

చంద్రబాబు, వైఎస్ఆరే నయం - కేటీఆర్
చంద్రబాబు, వైఎస్ఆరే నయం అని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు బఫూన్‌ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ బఫూన్‌ గాళ్లు ఎక్కడ ఉన్నారని.. ఊరు, పేరు అడ్రస్‌ లేని లవంగం గాళ్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇలాంటి పిచ్చోళ్లతో మనం పోరాడాల్సి వస్తోందని అనుకోలేదని అన్నారు. ఈడీ, బోడీలతో తమ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. దమ్ముంటే తమ ఆరోపణలకు మోదీ సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.

News Reels

Also Read: Munugode Bypolls: ‘ఫోన్ పే’లా ‘కాంట్రాక్ట్ పే’ - రాజగోపాల్ రెడ్డికి ప్రత్యర్థుల ఝలక్, అంతా రాత్రికి రాత్రే!

‘‘నిన్న మునుగోడు నియోజ‌కవ‌ర్గంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి ధ‌న‌వంతుడైతే ఆ నియోజ‌క‌వ‌ర్గం బాగుప‌డ‌దు. రాజ‌గోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్‌లు ఇవ్వడం కాదు. నల్గొండ జిల్లా అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి త‌ప్పుకుంటాం. మా మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను క‌ట్టుబ‌డి ఉన్నా. మాకు మా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కావాలి.’’ అని కేటీఆర్ అన్నారు.

Published at : 11 Oct 2022 02:51 PM (IST) Tags: Telangana BJP KTR Comments Minister KTR nalgonda district Munugode By elections Rajagopal reddy

సంబంధిత కథనాలు

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Rajagopal Reddy : కర్ణాటకతో పాటే తెలంగాణలో ఎన్నికలు, ముందస్తుపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

KTR: డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతం - మంత్రి కేటీఆర్

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

Bandi Sanjay : ఎంఐఎం, టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు - బండి సంజయ్

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?