Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని, "రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది యువకులు బలిదానం చేశారని ట్వీట్ చేశారు కవిత.
తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ బిడ్డలు చేసిన ప్రతి బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యేనంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మంగళవారం (నవంబర్ 29) దీక్షా దివస్ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ కు స్పందించి... అనుచిత వాక్యలు చేసిన కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని, "రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని ట్వీట్ చేశారు కవిత.
ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదన్నారు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ , దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనంటూ మండిపడ్డారు. సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీకి పోటీ చేసి గెలిచా అని కవిత స్పష్టం చేశారు.
ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! @RaoKavitha
— Telangana Congress (@INCTelangana) November 29, 2022
దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం.
దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు..చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయే!#UdyamaDrohiKCR
1/2 https://t.co/dPiRzJMRYG
‘ఇది దీక్షా దివాస్ కాదు.. దగా దివాస్! కవిత. దొంగ దీక్షతో ఉద్వేగాలను రెచ్చగొట్టి, యువతను బలిదానాల వైపు నడిపించిన దుర్దినం. దొంగ దీక్ష నాటకమాడిన మీ నాయన సీఎం కుర్చీ ఎక్కిండు..చిత్తశుద్దితో ఉద్యమం చేసి, బలిదానాలు చేసిన బిడ్డలకు కనీసం గుర్తింపే లేకపాయే!’ అని కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం చేసిన దీక్షను దొంగ దీక్ష అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకే. బతుకమ్మ ఆడినందుకే. బోనం కుండలు ఎత్తినందుకే. మీ ఇంటిల్లపాది సకల పదవుల, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలనేమనాలి!? అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. తన తండ్రి చేసిన దీక్షను దొంగ దీక్ష అనడంతో కవిత అదే స్థాయిలో ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై “ తుపాకీ ”ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం , బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 29, 2022
1/2 https://t.co/a22JuW1PGp
టీడీపీ అధినేత చంద్రబాబు తొత్తుగా ఉంటూ ఉద్యమకారుల పై “ తుపాకీ ”ఎక్కుపెట్టిన వారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళల పాత్రను కేవలం పప్పన్నం, బోనం మరియు బతుకమ్మకు పరిమితం చేస్తూ మాట్లాడడం మహిళల పట్ల మీ పార్టీకి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందంటూ రేవంత్ కు కౌంటరిచ్చారు. ఏఐసీసీ కీలక నాయకురాలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల ద్వారా బతుకమ్మ ఎత్తించినా, బతుకమ్మ పేరు ఉచ్చరించేలా చేసినా అది తెలంగాణ ఆడబిడ్డల ఘనతేనన్నారు. మిలియన్ మార్చ్, సాగరహారం, అసెంబ్లీ ముట్టడిలో మేము ఆడబిడ్డలము ముందున్నాము !! కానీ ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని ఘాటుగా ట్వీట్ ద్వారా బదులిచ్చారు ఎమ్మెల్సీ కవిత.