Janasena: తెలంగాణలోనూ జనసేన పోటీ - 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకుల ఎంపిక
Janasena: రాబోయే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. ఈ క్రమంలోనే 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు.
Janasena: జనసేన పార్టీ ఏపీతో పాటు తెలంగాణలోనూ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జీ నేమూరి శంకర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 32 నియోజకవర్గాల్లో కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు. కార్యనిర్వాహకులు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తర్వాత వారు అధిష్ఠానానికి నివేదిక అందజేయనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగానే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని శంకర్ గౌడ్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీలో ఉంటాం: పవన్
తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీలో నిల్చుంటుందని తెలిపారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన భేటీలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ భేటీకి తెలంగాణ ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ లీడర్స్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా తన గ్రాఫ్ పెంచుకుంటున్నారు పవన్ కల్యాణ్. అలాగే తెలంగాణలోనూ జనసేన పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే జరిగిన సమావేశంలో... తెలంగాణలో పోటీ చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు నియోజక వర్గాల వారీగా కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు.
నియోజకవర్గాల వారీగా కార్యనిర్వాహకుల జాబితా:
- మల్కాజ్ గిరి - దామరోజు వెంకటాచారి
- సనత్ నగర్ - మండపాక కావ్య
- జూబ్లీహిల్స్ - ఎస్. రమేష్
- ముషీరాబాద్ - బిట్ల రమేష్
- నర్సంపేట - మెరుగు శివకోటి యాదవ్
- స్టేషన్ ఘన్ పూర్ - గాదె పృథ్వీ
- వనపర్తి - నైని ముకుంద నాయుడు
- సిద్దిపేట - దాసరి పవన్
- హుస్నాబాద్ - తగరపు శ్రీనివాసర్
- జగిత్యాల - బెక్కం జనార్దన్
- కుత్బుల్లాపూర్ - నందగిరి సతీష్ కుమార్
- ఎల్బీ నగర్ - పొన్నూరు లక్ష్మీ సాయి
- శేరిలింగంపల్లి - చిరాగ్ ప్రతాప్ గౌడ్
- వైరా - తేజావత్ సంపత్ నాయక్
- మంచిర్యాల - సైదాల శ్రీనివాస్
- రామగుండం - మూల హరీష్ గౌడ్
- నాగర్ కర్నూల్ - వంగ లక్ష్మణ్ గౌడ్
- కొల్లాపూర్ - బైరపోగు సాంబశివుడు
- ఖమ్మం - మిరియాల రామకృష్ణ
- కొత్తగూడెం - వేముల కార్తీక్
- సంగారెడ్డి - కూనా వేణు
- సత్తుపల్లి - బండి నరేష్
- అశ్వారావు పేట - డేగల రామచంద్రారావు
- మునుగోడు - గోకుల రవీందర్ రెడ్డి
- పఠాన్ చెరువు - యడమ రాజేష్
- హుజూర్ నగర్ - సరికొప్పులా నాగేశ్వర్ రావు
- నకిరేకల్ - చెరుకుపల్లి రామలింగయ్య
- వనపర్తి - ముకుంద నాయుడు