Hyderabad News: హైదరాబాద్‌లో మహిళలకు రాత్రి ఉచిత రవాణా - పోలీసుల క్లారిటీ
Hyderabad Police News: హైదరాబాద్ లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో ఒంటరిగా ఉన్న మహిళలు లేదా యువతులు పోలీసులకు ఫోన్ చేస్తే ఫ్రీగా ఇంటి దగ్గర దింపుతారంటూ ఓ పోస్టర్ బాగా చక్కర్లు కొడుతోంది.
Hyderabad Latest News: హైదరాబాద్ లో రాత్రిపూట ఒంటరిగా ఉన్న మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని నగర పోలీసులు కల్పిస్తున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని మహిళలు విరివిగా షేర్లు చేసుకుంటున్నారు. ఆ పోస్టులో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఉండడం, వాటికి ఫోన్ చేస్తే ఉచిత రవాణా కల్పిస్తారని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. తాము అలాంటి సౌకర్యం ఏమీ ప్రవేశపెట్టలేదని స్పష్టత ఇచ్చారు. ఆ మెసేజ్‌తో పలువురు మహిళలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారని అన్నారు.
హైదరాబాద్ లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో పోలీసులకు ఫోన్ చేస్తే ఫ్రీగా ఇంటి దగ్గర దింపుతారంటూ ఓ పోస్టర్ బాగా చక్కర్లు కొడుతోంది. ‘‘రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ లు (1091, 7837018555) ను సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. వారు 24 గంటలు పని చేస్తారు’’ అంటూ ఓ పోస్టు విపరీతంగా షేర్ అవుతోంది.
పైగా టోల్ ఫ్రీ నెంబర్లను కూడా మెన్షన్ చేశారు. 1091, 78370 18555 నంబర్‌కు ఒక్క ఫోన్ చేస్తే స్థానిక పోలీసుల పెట్రోలింగ్ వాహనం లొకేషన్ కు వచ్చి ఒంటరిగా ఉన్న మహిళలను తీసుకెళ్తుందని బాగా ప్రచారం చేస్తుననారు. రాత్రి వేళల్లో మహిళలకు ఫ్రీ రవాణా సౌకర్యం పేరిట జరుగుతున్నది తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు.
We've seen #misleading information spreading on social media about a "free ride service" being offered by @hydcitypolice,This is not correct, Always verify the facts with trusted sources before sharing. Spreading false information can cause unnecessary panic & confusion. pic.twitter.com/RXqdTiZK9h
— Hyderabad City Police (@hydcitypolice) August 22, 2024