(Source: ECI/ABP News/ABP Majha)
Secunderabad: సికింద్రాబాద్‌లో అతి భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం - రంగంలోకి 8 ఫైరింజన్లు
Hyderabad: ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం.
Hyderabad Fire Accident: సికింద్రాబాద్‌లోని బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం (Secunderabad Fire Accident) చోటు చేసుకుంది. స్థానిక టిబర్ గౌడౌన్ డిపోలో (Timber Depot Fire Accident) పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మొత్తం 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాద సమయంలో గోడౌన్ లో 11 మంది కార్మికులు ఉండగా వారంతా అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం తీవ్రస్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య పెరగడంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది.
బుధవారం (మార్చి 23) తెల్లవారుజామున ఉదయం 3 నుంచి 4 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అగ్ని మాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు.
బోయిగూడ ఐడీహెచ్ కాలనీలోని టింబర్ స్క్రాప్ గోడౌన్‌లో మంగళవారం రాత్రి 15 మంది అందులో పని చేసే కార్మికులు నిద్ర పోయారు. వేకువజామున షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ 15 మందిలో ఇద్దరు వ్యక్తులు మంటల నుంచి తప్పించుకోగా.. మిగిలిన 13 మంది అగ్ని కీలల్లో చిక్కుకుపోయారు. పోలీసులు 11 మందిని గుర్తించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉందని తెలిపారు.
మంత్రి తలసాని సందర్శన
ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దుర్ఘటన చాలా బాధాకరమని, మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా కృషి చేసినప్పటికీ భారీగా ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు.
బిహార్‌కు చెందిన వారు.. నెలకు 12 వేల జీతం
ఈ ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. మృతులు 23 నుంచి 35 ఏళ్ళ వయసు గల యువకులు. బిహార్ ఛప్రా జిల్లా వాసులుగా తెలిసింది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్ కాల్ వచ్చింది. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయి. స్క్రాప్ గోడౌన్, ఫైర్ నిబంధనలు పాటించలేదు. మృతులు ఇక్కడ నివసిస్తున్నట్లు స్థానికులకు ఎవ్వరికీ తెలీదు. నిద్రలోనే పొగ పీల్చి మృతి చెందినట్లు తెలిసింది. గాయాలు అయిన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుంది. లోతుగా దర్యాప్తు చేస్తాం. గోడౌన్ యజమాని కుమారుడితో మాట్లాడాము. నెలకు 12వేల జీతానికి ఈ కార్మికులు పని చేస్తున్నారు.’’ అని అన్నారు.