Ganesh Immersion Live Updates: జగిత్యాల గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి.. నీళ్లలో పడిపోయిన మున్సిపల్ ఛైర్మన్
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయింది. హూస్సేన్ సాగర్ లో మహా గణపతిని నిమజ్జనం చేశారు.
LIVE

Background
నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. గణపతుల నిమజ్జనాల కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్ల ద్వారా లంబోదరుడి ప్రతిమలు నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్ గణనాథుడిని క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం చేశారు.
జగిత్యాల: నీళ్లలో పడిపోయిన మున్సిపల్ ఛైర్మన్
జగిత్యాల జిల్లా చింత కుంట చెరువులో గణేష్ నిమజ్జనం చేసే సమయములో ప్రమాదం చోటు చేసుకుంది. జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ అదుపుతప్పి చెరువులో పడిపోయారు. మున్సిపల్ చైర్మన్‌తో సహా మరో ముగ్గురు కూడా చెరువులో పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు గజ ఈతగాళ్లతో వారికి కాపాడి బయటికి తీసుకొచ్చారు.
హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం
ఖైరతాబాద్ మహారుద్ర గణపతి నిమజ్జనం పూర్తైంది. హుస్సేన్‌సాగర్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ సహాయంతో మహాగణపతి నిమజ్జనం జరిగింది.
ట్యాంక్‌బండ్ చేరుకున్న ఖైరతాబాద్ మహాగణపతి.. కాసేపట్లో నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకుంది. కాసేపట్లో పంచముఖ రుద్ర మహాగణపతి నిమజ్జనం జరగనుంది. దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైంది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు.
గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలు పలికిన గణేశ్ లడ్డూ
గచ్చిబౌలిలో రూ.18.50 లక్షలకు గణేశ్ లడ్డూ పలికింది. మై హోం భూజా అపార్ట్‌మెంట్‌లో గణేశ్ లడ్డూ వేలం పాటలో రూ.18.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు విజయభాస్కర్‌రెడ్డి.
కొనసాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. భారీ ట్రాలీపై ఖైరతాబాద్ గణేశుడిని ఊరేగిస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబరు 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. మరోవైపు భక్తులకు ఉచితంగా జీహెచ్ఎంసీ మాస్కులను పంపిణీ చేస్తుంది. మహిళల భద్రత కోసం శోభాయాత్రలో 4 షీ బృందాలతో గస్తీ కాస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

