![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Telangana News: కాంగ్రెస్ నేతలు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అవిశ్వాస తీర్మానం నెగ్గాలన్న ప్రయత్నంలో బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి యత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
![Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు Harish Rao alleges Congress leaders tries to kidnap Pirjadiguda mayor and corporators Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/f6725c69411d15a6f1adbb2c924c3aed1716140694542233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Harish Rao alleges Congress leaders tries to kidnap BRS Leaders | హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు అధికారం కోసం బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండించారు. తెలంగాణ డీజీపీ రవి గుప్తా, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం మంచిది కాదన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని హరీష్ రావు హెచ్చరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)