News
News
X

KCR Canvoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో డ్రైవర్‌పై కేసు.. హెచ్‌ఆర్‌సీలో బాధితుల ఫిర్యాదు

కానిస్టేబుల్ ఓ యువతిని నిశ్చితార్థం చేసుకొని మరొకరిని పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు ఆయనపై కేసు పెట్టారు.

FOLLOW US: 

ముఖ్యమంత్రి కేసీఆర్ వాహన శ్రేణిలో డ్రైవర్‌గా పని చేసే ఓ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. అయితే, వృత్తి గతంగా ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. కానిస్టేబుల్ ఓ యువతిని నిశ్చితార్థం చేసుకొని మరొకరిని పెళ్లి చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు ఆయనపై కేసు పెట్టారు.

వనపర్తి జిల్లా పెద్ద మందడి గ్రామానికి చెందిన శశి కుమార్ అనే 27 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వాహన శ్రేణి (కాన్వాయ్)లో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈయన కానిస్టేబుల్ (సెక్యురిటీ, ఇంటెలిజెన్స్). శశి కుమార్‌తో 2019 నవంబరు నెలలో తనకు నిశ్చితార్థం జరిగిందని, కానీ తాజాగా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు హైదరాబాద్‌లోని మానవ హక్కుల సంఘంలో (హెచ్‌ఆర్‌సీ) ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లోని జియాగూడకు చెందిన తాను తనతో సంబంధం కుదుర్చుకున్న తర్వాత రూ.5 లక్షలు కట్నం కోసం ఒప్పందం జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురు.. ఇక నేటి నుంచి..

తీరా నిశ్చితార్థం తరువాత రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని శశి కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారని బాధితురాలు ఆరోపించారు. ఇదంతా జరుగుతుండగానే 2021 ఆగస్టు 26న శశి కుమార్‌ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు వాపోయారు. ఇదే విషయం గురించి తాను హైదరాబాద్‌లోని కుల్సుంపుర పోలీసు స్టేషన్‌లో, నాగర్‌ కర్నూల్‌ పోలీసు స్టేషన్‌లలో కూడా గతంలోనే ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినా, పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. తనకు న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘాన్ని బాధితురాలు వేడుకున్నారు. అయితే, ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉంది.

మరోవైపు, కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో గతంలో అందిన ఫిర్యాదు మేరకు శశి కుమార్‌‌పై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Also Read: Warangal Chit Fund: భార్యాభర్తలపై పెట్రోల్ పోసి నిప్పు, సెల్‌ఫోన్ షాప్‌పై కూడా.. దంపతుల నిర్వాకం

Also Read: Hyderabad Police: ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే కఠిన చర్యలు.. హైదరాబాద్‌ పోలీస్‌ వార్నింగ్‌

Also Read: Petrol-Diesel Price, 4 September: కాస్త దిగిన ఇంధన ధరలు, లీటరుకు ఎంత తగ్గిందంటే.. తాజా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలా..

Also Read: Weather Updates: రాబోయే మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ఈ నెల 6న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

Published at : 04 Sep 2021 12:05 PM (IST) Tags: Fraud Case on Constable CM KCR Canvoy Wanaparthy Police kcr canvoy staff

సంబంధిత కథనాలు

వెయ్యి కిలోమీటర్లు దాటిన

వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"

30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!

30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

Chikoti Praveen: నన్ను చంపడానికి సుపారీ, వాళ్ల పేర్లు చెప్పాలని బాగా ఒత్తిడి చేస్తున్నారు - చికోటి సంచలన కామెంట్స్

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

TSRTC Bumper Offer: ఆస్పత్రికి వెళ్తున్నారా, అయితే ఆ రెండు గంటలూ ఉచిత ప్రయాణం!

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

KTR: మోదీ సర్, మీకు నిజంగా గౌరవం ఉంటే ముందు ఆ పని చెయ్యండి - కేటీఆర్ ట్వీట్

టాప్ స్టోరీస్

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

కమ్యూనిస్టులపై సంజయ్ సంచలన కామెంట్స్- కేసీఆర్‌ చిల్లర పెంకులకు ఆశపడ్డారంటూ ఆరోపణ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

Venkaiah On Sita Ramam: చాలా కాలం తర్వాత ఓ చక్కని సినిమా చూశా- సీతారామంపై వెంకయ్య రివ్యూ

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !