By: ABP Desam | Updated at : 04 Sep 2021 07:02 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గత నెల రోజులుగా నిలకడగా ఉంటున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే కొనసాగుతోంది. కానీ, హైదరాబాద్‌లో మాత్రం తాజాగా ధరల్లో మార్పు లేదు. కానీ, అంతకుముందు రెండ్రోజులుగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. వరంగల్ నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే పెట్రోల్ ధరల మార్పులు ఉంటున్నాయి.
తెలంగాణలో సెప్టెంబరు 4న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.105.40 కాగా.. డీజిల్ ధర రూ.96.84 గానే కొనసాగుతూ ఉంది. డీజిల్ ధర, పెట్రోల్ ధర ముందురోజుతో పోలిస్తే నిలకడగా ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.31 పైసలు తగ్గి రూ.105.27గా ఉంది. డీజిల్ ధర రూ.0.29 పైసలు తగ్గి రూ.96.71గా ఉంది.
ఇక వరంగల్‌లో కొద్ది రోజులుగా ఇంధన ధరలు నిలకడగా ఉండగా తాజాగా కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర రూ.104.91గా ఉంది. డీజిల్ ధర రూ.96.38 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగానే పెరిగాయి. లీటరుకు రూ.068 పైసలు తగ్గి పెట్రోల్ ధర రూ.106.99 గా ఉండగా.. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.63 పైసలు తగ్గి రూ.98.18 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర రూ.0.10 పైసలు తగ్గి.. ప్రస్తుతం రూ.107.77 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.09 పైసలు పెరిగి రూ.98.70కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.50గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.51 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.47 పైసలు తగ్గి రూ.97.47గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో స్వల్పంగా తగ్గుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.30 పైసలు తగ్గి రూ.108.18 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గింది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.28 పైసలు తగ్గి రూ.99.03గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 3 నాటి ధరల ప్రకారం 69.29 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Bharti Airtel Q4 Earnings: జియోను బీట్ చేసిన ఎయిర్టెల్ ARPU, రూ.2007 కోట్ల బంఫర్ ప్రాఫిట్
Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్! బిట్‌కాయిన్ సహా మేజర్ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!
Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
Elon Musk Twitter Deal: మస్క్ మామా మజాకా! ట్విట్టర్ డీల్‌కు మస్కా కొట్టాడుగా!
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి