Hyderabad Police: ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారా? అయితే కఠిన చర్యలు.. హైదరాబాద్‌ పోలీస్‌ వార్నింగ్‌

ఓ నకిలీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో పోలీసులు స్పందించారు. అతి అబద్ధమని తేల్చి చెప్పారు. ఫార్వర్డ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

FOLLOW US: 

సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాప్తి చెందే నకిలీ వార్తలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఏకంగా పోలీసులు చెబుతున్నారనే తప్పుడు వార్తలతో మెసేజ్‌లు ఫార్వర్డ్ అవుతుండడంతో అమాయక జనం నమ్మేస్తున్నారు. ఇలాగే ఓ ఈ మెసేజ్ వైరల్ అవుతుండడం ఆ విషయం పోలీసులకు తెలిసింది. దీంతో తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఆ నకిలీ సందేశాన్ని నమ్మి ఫార్వర్డ్ చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇంతకీ ఆ నకిలీ మెసేజ్ ఏంటంటే..
దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 4 నుంచి 7 వరకు లోక్‌ అదాలత్‌లో పెండింగ్‌ చలానాలను చెల్లించే వారికి 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. వచ్చే నెలే అక్టోబరు కావడంతో ఈ సమయంలో ఈ మెసేజ్ ఇంకా వైరల్ అవుతోంది. దీంతో తాజాగా హైదరాబాద్‌ పోలీసులు ఈ విషయంపై స్పందించారు. దీనిపై ట్విటర్‌ వేదికగా పోలీసులు హెచ్చరిక చేశారు. 

‘ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్‌ అంటూ ఓ ఫేక్‌ వార్త వైరల్‌ అవుతోంది. ఈ వార్తను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి, షేర్‌ చేయకండి. ఇలా ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ లేదా షేర్ చేస్తున్న వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత కొన్ని రోజులుగా అది నిజమేనని జరుగుతున్న ప్రచారానికి హైదరాబాద్ పోలీసులు స్పష్టత ఇచ్చి ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది.

ఇటీవల హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల తీరు మారింది. ఒకప్పటిలా రోడ్డుపై వాహనాలను ఆపి చలాన్లు వసూలు చేసే కాలం పోయింది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ చలాన్‌ విధానం అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చలాన్‌లు నేరుగా ఫోన్‌కు మెసేజ్‌ వస్తున్నాయి. చలాన్‌ల తాలుకూ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేయాలని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పెండింగ్‌లో ఉన్న ఈచలాన్‌పై పోలీసులు బంపరాఫర్‌ ఇచ్చినట్లు ఇటీవల ఓ వార్త హల్చల్‌ చేస్తోంది.

Published at : 04 Sep 2021 10:53 AM (IST) Tags: Hyderabad police hyderabad traffic police fake news in Social media fake news spreading

సంబంధిత కథనాలు

Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 26th June 2022: వినియోగదారులకు ఊహించని షాక్‌లు ఇస్తున్న బంగారం- ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే?

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

Actor Sai Kiran : పోలీసులను ఆశ్రయించిన గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి ఫాదర్- మోసం పోయానంటూ ఫిర్యాదు

SCCL Junior Assistant Recruitment 2022: డిగ్రీ అర్హతతో సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు- జులై 10 ఆఖరు తేదీ

SCCL Junior Assistant Recruitment 2022: డిగ్రీ అర్హతతో సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు- జులై 10 ఆఖరు తేదీ

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ తల్లి అంజనా దేవీ విరాళం

Pawan Kalyan : జనసేన కౌలు రైతు భరోసా నిధికి పవన్ తల్లి అంజనా దేవీ విరాళం

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ఇద్దరు మృతి

Puppalaguda Accident : పుప్పాలగూడలో ఘోర ప్రమాదం, సెల్లార్ పనుల్లో గోడ కూలి ఇద్దరు మృతి

టాప్ స్టోరీస్

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

TS Govt : టీచర్ల ఆస్తుల ప్రకటనపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం, విద్యాశాఖ ఉత్తర్వులు నిలిపివేస్తూ ఆదేశాలు

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

CM Jagan: రూట్ మారుస్తున్న సీఎం జగన్- ప్లీనరీ తర్వాత ఆ విమర్శలకు చెక్‌ పెడతారట! 

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్