By: ABP Desam | Updated at : 02 Aug 2023 07:19 AM (IST)
ఇండియా వైపు ఉండబోం- ఎన్డీఏ వైపు లేము : సీఎం కేసీఆర్
ఇండియా లేదా ఎన్‌డీఏలో ఎవరి పక్షాన కూడా భారత్ రాష్ట్ర సమితి ఉండబోదని స్పష్టం చేశారు బీఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్. బీఆర్‌ఎస్ ఒక్కటిగా లేదని చాలా పార్టీలు తమతో కలిసి వస్తాయన్నారు. మహారాష్ట్ర పర్యటనలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ చాలా విషయాలపై స్పందించారు.
న్యూ ఇండియా అంటే ఏమిటి? అని ప్రశ్నించిన కేసీఆర్... 50 ఏళ్ల పాటు వారు పాలించారని ఏ మార్పు వచ్చిందని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. మార్పు రావాల్సింది పార్టీల్లో కాదని దేశంలో మార్పు రావాలని అన్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ శంఖారావం పూరిచిందన్నారు కేసీఆర్. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తోంది తెలిపారు. ఎన్నికలకు అనుగుణంగా పనులు ప్రారంభమయ్యాయి. పార్టీ ఇప్పటికే 14.10 లక్షల మందితో కూడిన బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసింది, వారు ఇప్పటికే మహారాష్ట్రలో గ్రౌండ్ లెవెల్లో పని ప్రారంభించారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్‌ఎస్ అధినేత తెలిపారు. మరో 15 నుంచి 20 రోజుల్లో ప్రతి గ్రామంలో బ్యాలెన్స్ పనులు పూర్తవుతాయి అన్నారు.
మహారాష్ట్రలో సహజసిద్ధమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని, మరే రాష్ట్రం కూడా ఇందులో పోటీ పడలేదని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర కలిగి ఉన్న అపారమైన సంపదతో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. అయినా సరే దురదృష్టవశాత్తు ఔరంగాబాద్ నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంఘాల నిరంతర పోరాటాలపై బీఆర్‌ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో దళితులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. వివక్షను రూపుమాపి బరాక్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నది అమెరికా, అలా వివక్ష పాపాలను కడుక్కుందని సీఎం అన్నారు.
అంతకు మందు ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రముఖ కవి అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నాభావు సాఠే మహారాష్ట్ర యుగకవి అని, దళిత సాహిత్య చరిత్రలో ఆద్యుడిగా పేరుగాంచారని అన్నారు. అన్నాభావు సాఠే భరతమాత ముద్దు బిడ్డ అని కేసీఆర్ కొనియాడారు. అన్నాభావు సాఠేకు భారతరత్న ఇవ్వాలని, ఈ ప్రతిపాదనకి తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్పతనాన్ని గుర్తించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. మహారాష్ట్రలోని వాటేగావ్‌లో అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సాఠే చిత్రపటానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభపై మాట్లాడారు.
రష్యా లాంటి పెద్ద దేశమే అన్నాభావు సాఠేని గుర్తించిందని కేసీఆర్ గుర్తించారు. అలాంటి అన్నాభావు సాఠేని మన దేశంలో సరిగ్గా గుర్తించలేదని అన్నారు. రష్యాలోని మెయిన్ లైబ్రరీలో అన్నాభావు సాఠే విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కేసీఆర్ చెప్పారు. ఆయన రచనలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని అన్నారు. అన్నాభావు రచనలు అన్ని భాషల్లోకి అనువదించాలని కేసీఆర్ కోరారు.
ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘అణగారిన వర్గాల కోసం అన్నాభావు సాఠే గొంతెత్తి పోరాడారు. పీడిత ప్రజల తరఫున అన్నాభావ్ బాసటగా నిలిచారు. సమస్యలను చూసి అన్నాభావ్ ఎప్పుడూ వెనక అడుగు వేయలేదు. రష్యా ప్రభుత్వం కూడా అన్నాభావును పిలిపించి ఘనంగా సత్కరించింది. అన్నాభావ్ సాఠేను లోక్‌షాహెర్ బిరుదు కూడా లభించింది.
వరంగల్ ‘నిట్’ నియామకాల్లో నిబంధనలకు తిలోదకాలు, ఆర్టీఐ వివరాలతో బయటపడ్డ అవకతవకలు
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Ganesh Immersion 2023: ఘనంగా ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు - గంగమ్మ ఒడికి చేరిన లక్షల విగ్రహాలు
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు
/body>