News
News
X

Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా ‌సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

FOLLOW US: 
Share:

హైదరాబాద్: హిండెన్ బర్గ్ నివేదిక విడుదలైన 10 రోజుల్లోనే గౌతమ్ అదానీ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుండి 22 వ స్థానానికి పడిపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అదానీ సంస్థ అనేక ప్రభుత్వరంగ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడంతో పాటు, ఎల్ఐసీ అదానీ గ్రూప్ లో రూ.80 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎస్బీఐ నుండి రూ. 27 వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుయ రూ. 5,380 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.7 వేల కోట్లు, ఇలా ఏడు జాతీయ బ్యాంకులు అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాయన్నారు.  

అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్.. 
హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంస్థల షేర్లు 51% పడిపోగా , ఎల్ ఐసీ రూ.18 వేల కోట్లు నష్టపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చిరుద్యోగులు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎల్ఐసీ షేర్లు కొని, అదానీ సంస్థ కారణంగా తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా ‌సుప్రీం కోర్టు జడ్జితో అదానీ వ్యవహారంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

అదానీ సంస్థల కారణంగా ఎల్ ఐసీ, ఎస్బీఐ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు ‌నష్టపోతున్నా ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బహిష్కరించడం, మోదీ ప్రసంగం సమయంలో వాకౌట్ చేయడంతో పాటు పార్లమెంటులో ప్రతి రోజు నిరసన తెలిపారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ర్టపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీకి ప్రజలపై పట్టింపు లేదని, తన‌ మిత్రులైన పారిశ్రామిక వేత్తలపైనే ఎక్కువ పట్టింపు ఉందనే విషయం ఇవ్వాల్టి ప్రధానమంత్రి ప్రసంగంతో తేటతెల్లమైందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు పథకాన్ని కాపీకొట్టి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించిందని, మొదటి ఏడాది 11 కోటె 84 లక్షల మంది రైతులకు రూ.6 వేలు ఇచ్చి, రెండో ఏడాది 9 కోట్ల 30 లక్షల రైతులు, ఆ తరువాత ఏడాది 9 కోట్ల రైతులు, ఆ తరువాత ఏడున్నర కోట్ల మంది రైతులు , ఈ ఏడాది 3 కోట్ల 87 లక్షల మంది రైతులకు మాత్రమే ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. జగిత్యాల జిల్లా నుండి అకారణంగా 50 వేల మంది రైతులను, నిజామాబాద్ నుంచి 60 వేల రైతులను పీఎం కిసాన్ పథకం నుండి తొలగించారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కానీ ప్రధాని మోదీ ఈరోజు ప్రసంగంలో , ఈ ఏడాది కూడా 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ పథకం అమలు చేశామని నిండు సభలో అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

Published at : 08 Feb 2023 08:02 PM (IST) Tags: PM Modi MLC Kavitha Kavitha Gautam Adani Hindenburg Research

సంబంధిత కథనాలు

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు-  మంత్రి కేటీఆర్

మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

Sriram Shobha Yatra : హైదరాబాద్ లో ప్రారంభమైన శ్రీరామనవమి శోభయాత్ర, భారీగా బందోబస్తు

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

TSPSC Paper Leak: గ్రూప్-1 పేపర్ లీక్ వ్యవహారం - వాళ్ల పాపం, ఆమెకు శాపంగా మారింది!

టాప్ స్టోరీస్

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు