అన్వేషించండి

Nizam College Students Protest: కొనసాగుతున్న నిజాం విద్యార్థుల ఆందోళన - మంత్రి కార్యాలయం ముట్టడి

Nizam College Students Protest: నిజాం కళాశాల విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ లోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. 

Nizam College Students Protest: నిజాం కళాశాల విద్యార్థులు చేస్తున్న నిరసన నేటికీ కొనసాగుతూనే ఉంది. వీరికి మద్దతుగా ఏబీవీపీ నాయకులు బషీర్ బాగ్ లోని మంత్రి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఉస్మానియా వీసీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ స్పందించి సమస్య పరిష్కరించాలని చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే ఈరోజు మంత్రి కార్యాలయాన్ని ముట్టిడించినట్లు వివరించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. 

నిజాం కాలేజీ హాస్టల్‌ సీట్లకు దరఖాస్తులు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నవంబరు 17 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. 50 శాతం చొప్పున యూజీ, పీజీ విద్యార్థినులకు సీట్లను కేటాయిస్తామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. నవంబరు 17 వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నవంబరు 19న తుది జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. సీట్లు కోరే విద్యార్థులు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చు. ఇదిలా ఉంటే హాస్టల్‌లోని సీట్లను తమకే కావాలని గత కొన్ని రోజులుగా నిజాం కాలేజీల విద్యార్థినులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు  హైదరాబాద్ నిజాం కళాశాలలో హాస్టల్ సౌకర్యం కోసం యూజీ విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు తమ సమస్యను గుర్తించి రూ.5 కోట్లు కేటాయించారని.. కానీ విద్యాశాఖ అధికారులు మాత్రం 50 శాతం మాత్రమే సీట్లను యూజీ విద్యార్థులకు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. తమకు హాస్టల్​లో  100 శాతం గదులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం యూజీ, 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయిస్తూ.. విద్యాశాఖ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రంజిని, వార్డెన్​లు.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల దగ్గరకు వచ్చి అర్హత కలిగిన విద్యార్థులు వసతి గృహంలో ప్రవేశానికి రావాలని సూచించారు.

వసతి గృహంలో గదులు కావాల్సిన వారు నవంబరు 17లోపు దరఖాస్తు పెట్టుకోవాలని.. 19లోపు అర్హత ఉన్న విద్యార్థుల లిస్ట్ ప్రకటిస్తామని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. 2017లో మంత్రి కేటీఆర్ నిజాం కాలేజీకి వచ్చినప్పుడు బాలికల వసతి గృహం కోసం వినతిపత్రం ఇచ్చామని విద్యార్థులు తెలిపారు. తమ సమస్యను చూసి కేటీఆర్ రూ.5 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. తమ వల్లనే నూతన వసతి గృహం నిర్మాణం అయ్యిందన్నారు. తమకు హాస్టల్​లో 100 శాతం గదులు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని యూజీ విద్యార్థులు స్పష్టం చేశారు. గత ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. తమ న్యాయమైన డిమాండ్​పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget