హైదరాబాద్ ఫ్లై ఓవర్ పనుల్లో అపశ్రుతి- ర్యాంపు కూలి పదిమందికి గాయాలు
ఫ్లై ఓవర్ ర్యాంపు కూలిన ప్రమాదం గాయపడిన వారంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. పిల్లర్లపై ఇనుప వంతెనను సెట్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.
హైదరాబాద్‌లోని సాగర్ రింగ్‌రోడ్‌లో జరుగుతున్న ఫ్లై ఓవర్ పనుల్లో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ ర్యాంపు కూలింది. ఈ దుర్ఘటనలో కూలీలు గాయపడ్డారు. పది మందిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
సాగర్ రింగ్‌రోడ్డులో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. మంగళవారం రాత్రి బైరామల్‌గూడ వద్ద ఫ్లై ఓవర్ ర్యాంపు కూలింది. ఈ దుర్ఘటనలో పదిమంది కూలీలుకు చిక్కుకుపోయారు. అక్కడే పని చేస్తున్న మిగతా వాళ్లు, కాంట్రాక్ట్ అధికారులు వారిని వెలికి తీశారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెబుతున్నారు.
ఫ్లై ఓవర్ ర్యాంపు కూలిన ప్రమాదం గాయపడిన వారంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. పిల్లర్లపై ఇనుప వంతెనను సెట్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన అర్ధరాత్రి జరగడంతో పెను ప్రమాదం తప్పింది అనుకోవాలి. చాలా మంది ఈ ప్లైఓవర్ కింద నుంచి వాహనాదారులు వెళ్తూ ఉంటారు. జనాలు తిరిగే టైంలో జరిగి ఉంటే ప్రమాద స్థాయి మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు అంటున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పాట్‌ను సందర్శించారు. అక్కడి వారితో మాట్లాడారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
Also Read: బీసీ కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం షాక్, రూ.1 లక్ష ఆర్థిక సాయంపై కీలక అప్ డేట్!