అన్వేషించండి

Telangana BCs Scheme: బీసీ కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం షాక్, రూ.1 లక్ష ఆర్థిక సాయంపై కీలక అప్ డేట్!

Telangana BCs Rs 1 Lakh Scheme : బీసీ కుల వృత్తి, చేతివృత్తిదారులకు రూ.1 లక్ష ఆర్ధిక సాయంపై దరఖాస్తుల ప్రక్రియ ముగిసిందని మంత్రి గంగుల కమలకార్ స్పష్టం చేశారు.

Telangana BCs Rs 1 Lakh Scheme : తెలంగాణలో బీసీ కుల వృత్తి, చేతివృత్తిదారులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీసీలను ఆదుకునేందుకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే పథకానికి అర్హులైన వారికి దరఖాస్తుల కోసం ఇచ్చిన నేటితో ముగిసింది. దరఖాస్తు ప్రక్రియలో జాప్యం అవుతుందని, తుది గడువు పొడిగిస్తారని భావించిన లబ్దిదారులకు నిరాశే ఎందురైంది. దరఖాస్తులకు గడువు పొడించేది లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈరోజు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దరఖాస్తులు పరిశీలించిన అనంతరం లబ్ధిదారులకు జులై 15న చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పారు.

దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీసీలకు లక్ష రూపాయలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసినమంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ కమిటీ విధి విధానాలు రూపొందించింది. బీసీ కుల వృత్తి, చేతివృత్తిదారుల నుంచి జూన్ 6 నుంచి దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. కులం, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా.. వాటి కోసం ప్రభుత్వ కార్యాలయాలకు బీసీ వర్గాల లబ్దిదారులు క్యూ కట్టారు. పడిగాపులు కాసినా తమకు కావాలసిన పత్రాలు చేతికి అందకపోవడంతో బీసీలకు రూ.1 లక్ష సాయానికి లబ్దిదారులు చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు. ఆన్ లైన్లో అప్లై చేసేందుకు సైతం ఇబ్బందులు ఎదురయ్యాయని కొందరు లబ్దిదారులు వాపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన తుది గడువు నేడు (మంగళవారం) ముగిసింది. తమ కష్టాలు చూస్తున్న ప్రభుత్వం దరఖాస్తుల తుది గడువును పొడిగిస్తుందని లబ్దిదారులు భావించారు. కానీ దరఖాస్తుల గడువు ముగిసిందని, ఈరోజు వరకు దరఖాస్తు చేసిన వారి అప్లికేషన్లు మాత్రమే పరిశీలిస్తామని మంత్రి గంగుల చేసిన ప్రకటనతో వారికి షాకిచ్చినంత పనైంది. 

ప్రతినెల 15వ తేదీన లబ్దిదారులకు రూ.1 లక్ష చెక్కులను అందిస్తామన్నారు. దాదాపు 5 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చుంటాయని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి చెక్కులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గంగుల తెలిపారు. అప్లికేషన్లు చెక్ చేసి, ఎంక్వైరీ చేయడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందని వివరించారు.

సర్వర్లు మొరాయిస్తున్నాయని దరఖాస్తులకు ఇబ్బంది అవుతుందని షాబాద్, షాద్ నగర్ రహదారిపై లబ్దిదారులు ఆందోళన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎమ్మార్వో ఆఫీసుల వద్ద బీసీ వర్గాలకు చెందిన వారు ప్రభుత్వం అందించే రూ.1 లక్ష ఆర్థిక సాయం కోసం క్యూ కట్టారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు కానీ వారి వద్ద ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడంతో ఒక్కసారిగా తహశీల్దార్ కార్యాలయాలకు బీసీలు క్యూ కట్టారు. సర్వర్లు మొరాయించడంతో పత్రాలు ప్రింట్ తీసుకోవడానికి వీలు కాలేదని కొందరు వాపోతుంటే, డెడ్ లైన్ పొడిగిస్తే అర్హులమైన తాము ప్రభుత్వం అందించే లక్ష సాయం పొందడానికి దరఖాస్తు చేసుకుంటామని కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది -  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
TG TET 2024: తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Waqf Bill TDP: వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జలపాతంలో కలెక్టర్, సామాన్యుడిలా ఎంజాయ్!ఎందుకయ్యా నీకు రాజకీయాలు, మంత్రి వాసంశెట్టికి క్లాస్ పీకిన చంద్రబాబుRohit Sharma Virat Kohli Failures |  హిట్ మ్యాను, కింగు ఇద్దరూ ఆడకపోతే ఎవరిని అని ఏం లాభం | ABP DesamIndia Strategical Failures vs NZ Test Series | గంభీర్ సారు గారి దయతో అప్పన్నంగా అప్పచెప్పాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది -  పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హోంమంత్రినైతే పరిస్థితి వేరేలా ఉంటుంది - పిఠాపురంలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
TG TET 2024: తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Waqf Bill TDP: వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
వక్ఫ్ బిల్లుకు టీడీపీ వ్యతిరేకమని టీడీపీ నేత ప్రకటన - జాతీయ రాజకీయాల్లో కలకలం - అసలు నిజమేంటి ?
Viral News: పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
పార్టీకి ఉపయోగపడకుంటే రాజకీయాలు ఎందుకయ్యా? మంత్రి సుభాష్‌కు చంద్రబాబు క్లాస్‌- ఆడియో వైరల్
Raashii Khanna : స్టన్నింగ్ లుక్స్​లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
స్టన్నింగ్ లుక్స్​లో రాశి ఖన్నా.. గ్రీన్ లెహంగాలో అందంగా నవ్వేస్తోన్న హీరోయిన్
APTET Results: ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ టెట్‌-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత - రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Actress Kasturi : తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
తమిళనాడులోని తెలుగువారిపై నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు
Andhra Pradesh News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ మద్దతుదారులపై కేసులు- పోలీసులకు జగన్ వార్నింగ్
Embed widget