Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్
Piyush Goyal On CM KCR : 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరం మార్చేందుకు పరిశీలిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
Piyush Goyal On CM KCR : తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ధాన్యం కొనుగోలుపై గతంలో పీయూష్ గోయల్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్దాలు చెప్పారని అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. తాజాగా పీయూష్ గోయల్ మరోసారి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం అడ్డంగా దోచుకుంటోంది..
— BJP Telangana (@BJP4Telangana) July 3, 2022
-శ్రీ @bandisanjay_bjp #ModiAagayaKcrDargaya pic.twitter.com/gQH5zMgY67
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్
తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడుతామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసిందని, వారి ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి ఆకాంక్షలు నెరవేరలేదని నిరాశలో ఉన్నారన్నారు. తెలంగా కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. బీజేపీ కార్యవర్గ భేటీలో తెలంగాణ పరిస్థితులను డీకే అరుణ వివరించారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ముగింపు పలికి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తంచేశారు.
కుటుంబపాలనకు విముక్తి
తెలంగాణకు దేశంలో నెంబర్ వన్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పీయూష్ గోయల్ అన్నారు. కానీ కుటుంబ పాలన వల్ల పరిస్థితులు మారడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు ఇంకా పెరిగాయన్నారు. టీఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి చేస్తుందన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారన్నారు.
హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తారా?
హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను విలేకరి ప్రశ్నించగా.. ‘2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు' అన్నారు. బీజేపీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాజధానిని భాగ్యనగరంగా పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ పటేల్ ఏక్ భారత్ అనే పదాన్ని భాగ్యనగరంలోనే ఉపయోగించారని ప్రధాని అన్నారు. హైదరాబాద్ భాగ్యనగరమని ప్రధాని మోదీ అన్నారు. ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైనదని, సర్దార్ పటేల్ ఏకీకృత భారతదేశానికి పునాదిని నిలబెట్టారని ప్రధాని మోదీ అన్నారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకెళ్లడం బీజేపీ బాధ్యత అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్‌లో ప్రధానిని ఉటంకిస్తూ అన్నారు. హైదరాబాద్‌కు భాగ్యనగర్‌గా పేరు మార్చాలని బీజేపీ సైద్ధాంతిక మూలాధారమైన ఆర్‌ఎస్‌ఎస్, పలువురు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read : BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?
Also Read: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?