Kasani Gnaneswara Rao : టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్, నేడే చేరిక!
Kasani Gnaneswara Rao : మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ చేరుతున్నారు. ఇవాళ రాత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
Kasani Gnaneswara Rao : మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరనున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాసానికి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించనున్నారు చంద్రబాబు.
టీఆర్ఎస్, బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం!
మాజీ ఎమ్మెల్సీ, ముదిరాజ్ మహా సభ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఇటీవల జ్ఞానేశ్వర్‌ను కలిసి చర్చలు జరిపారు. దీంతో కాసాని బీజేపీలో చేరుతారన్న చర్చ సాగింది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగి కాసానితో మంతనాలు చేశారు. మంత్రి హరీశ్ రావుతో భేటీ అనంతరం జ్ఞానేశ్వర్ టీఎర్ఎస్‌లో చేరేందుకు అంగీకారం తెలిపారన్న ప్రచారం జరిగింది. ఇటీవల ముదిరాజ్ మహాసభ సమావేశంలో కాసాని టీఎర్ఎస్‌లో చేరడానికి రాష్ట్ర కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఇంతలోనే కాసాని ట్విస్ట్ ఇచ్చారు. ఆయన టీడీపీ చేరేందుకు ఆసక్తి చూపారు. శుక్రవారం రాత్రి కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు.
కాసాని జ్ఞానేశ్వర్ ప్రస్థానం
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేత. కాసాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
మన పార్టీ
2001–2006 వరకు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కాసాని పనిచేశారు. 2007–11 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు.
1975–1987 లో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 1987–1993 రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
1993లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా, 1999 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 2005లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2007 కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టారు. కాసాని ప్రస్తుతం ఈ పార్టీలోనే ఉన్నారు.
Also Read : Munugode By Election : మునుగోడు ప్రజలు కాంట్రాక్టర్లు కాదు మూటలకు అమ్ముడుపోవడానికి- రేవంత్ రెడ్డి