Hyderabad CP Sajjanar: అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం ఉండదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్
Sajjanar Road Safety Alert | రోడ్డుపై వెళ్లేటప్పుడు పిల్లల చేతులు వదలవద్దని తల్లిదండ్రులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఒళ్లు గగుర్పొడిచే వీడియోను సజ్జనార్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Hyderabad CP Sajjanar | ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. కళ్లముందే ఒక చిన్నారి ప్రాణం ప్రమాదపు అంచుల్లోకి వెళ్లడం వీడియో చూసిన ఎవరినైనా ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆ బస్సు డ్రైవర్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించి, సరైన సమయంలో బ్రేకులు వేయడం వల్ల ఒక పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పోస్ట్ చేసి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులను అప్రమత్తం చేశారు.
అయితే, అందరికీ ఈ చిన్నారిలాగే అదృష్టం కలిసి వస్తుందని అనుకోవడం పొరపాటు అన్నారు. రోడ్లు, రహదారుల మీద ప్రయాణించేటప్పుడు క్షణకాలం పాటు మన కళ్ళు కప్పినా, లేదా మన దృష్టి మళ్లినా కోలుకోలేని నష్టం జరుగుతుందని తల్లిదండ్రులను, పెద్దలను హెచ్చరించారు. ముఖ్యంగా రద్దీగా ఉండే రోడ్ల పక్కన నడిచేటప్పుడు పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ వీడియో చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. ఆ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో ఉండబట్టి పెను ప్రమాదం తప్పింది.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 4, 2026
కానీ గుర్తుంచుకోండి.. అందరికీ ఈ చిన్నారిలా అదృష్టం ఉండదు.
తల్లిదండ్రులారా! రహదారుల పక్కన నడుస్తున్నప్పుడు మీ పిల్లల చేతిని వదలకండి. చిన్న నిర్లక్ష్యం తీరని శోకాన్ని… pic.twitter.com/FMrLhzZFkS
పిల్లల చేతిని అసలు వదలకండి.. సజ్జనార్ సలహా
‘తల్లిదండ్రులారా! ఇది మీకోసం ఒక హెచ్చరిక. రోడ్లు, రహదారుల పక్కన నడుస్తున్నప్పుడు మీ పిల్లల చేతిని అస్సలు వదలకండి. వారు చిన్నపిల్లలు, వాహనాల వేగాన్ని లేదా ప్రమాదాన్ని అంచనా వేయలేరు. మీ చిన్న నిర్లక్ష్యం మీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుంది. పిల్లల భద్రత విషయంలో రాజీ పడకండి, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి!’ అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఓ వీడియో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ వైరల్‌గా మారింది.
రోడ్డుపై ఆదమరిచి ఉంటే.. ఆయువు ఆవిరవుతుంది.. జాగ్రత్త!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 4, 2026
తల్లిదండ్రులారా.. రోడ్డుపై నడిచేటప్పుడు పిల్లల చేయి అస్సలు వదలకండి.. గట్టిగా పట్టుకోండి. చిన్నప్పటి నుంచే వారికి రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించండి.
వాహనదారులారా.. పాఠశాలలు, నివాస ప్రాంతాల్లో దయచేసి వేగం తగ్గించండి.… https://t.co/DNHwazDo1y pic.twitter.com/wJ9ahDSYMF
స్కూల్స్, నివాస ప్రాంతాల్లో వాహనదారులు దయచేసి వేగం తగ్గించాలని సూచించారు. చిన్నపిల్లలు ఎటు వైపు నుంచి వస్తారో తెలియదు, కనుక అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డుపై ఆదమరిచి ఉంటే.. ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని హెచ్చరించారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని కీలక సూచనలు చేశారు.
ట్రెండింగ్ వార్తలు























