అన్వేషించండి

Municipal Elections 2026: మున్సిపల్ పోరుకు రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్; మంత్రులకు దిశానిర్దేశం, బుధవారం నుంచే సీఎం ప్రచారం

Telangana : మున్సిపల్ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికల స్థాయిలో సీరియస్‌గా తీసుకొని కాంగ్రెస్ వ్యూహాలురచిస్తోంది. విజయమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్‌ రూపొందించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మున్సిపల్ ఎన్నికల కోసం కాంగ్రెస్ వ్యూహాలు, సీఎం దిశానిర్దేశం.
  • మంత్రులు జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి.
  • టికెట్ దక్కని వారిని బుజ్జగించి, సమన్వయంతో పనిచేయాలని సూచన.
  • ముఖ్యమంత్రి ప్రచార యాత్రలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Telangana Municipal Elections 2026: తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ శ్రేణులను, మంత్రులకు కీలక సూచనలు చేశారు.  జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక సూచనలు చేశారు. ఏ ఒక్క స్థానాన్ని కూడా వదులుకోకుండా క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

మంత్రులకు క్షేత్రస్థాయి బాధ్యతలు 

ఈ ఎన్నికల్లో మంత్రుల పాత్ర అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులందరూ తమకు కేటాయించిన జిల్లాలకు తక్షణమే వెళ్లాలని, అక్కడ మున్సిపాలిటీల వారిగా క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ముఖ్యంగా వెనుకబడిన మున్సిపాలిటీలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ పార్టీ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విశ్లేషణ చేయాలని సూచించారు. 

ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు మంత్రులు జిల్లాల్లోనే ఉంటూ, అక్కడ జరుగుతున్న పరిణామాలను, పార్టీ పురోగతిని వివరిస్తూ తనకు రోజువారీ నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. 

ఎన్నికల సమయంలో సహజంగానే టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో టికెట్‌ దక్కని నేతలను బుజ్జగించాలని సూచించారు. ఈ పని కూడా మంత్రులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు.  పార్టీ కోసం పని చేసే పాత నేతలకు , ఇటీవల పార్టీలో చేరిన కొత్త నేతలకు మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా సమన్వయం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడాలని అని మంత్రులకు ఉద్బోధించారు. అందరూ సమిష్టిగా పని చేస్తేనే విజయం సాధ్యమని, ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని చెప్పారు. 

మున్సిపల్ ఎన్నికల గెలుపు ఓటములకు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తేల్చారు. ప్రతి స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలని ఆదేశించారు. 

రేవంత్ రెడ్డి డిస్ట్రిక్ టూర్ షెడ్యూల్ 

మంత్రులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి ఆయన జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు    భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్-5 కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో పర్యటన, బహిరంగ సభ ఉంటుంది. డిసెంబర్-6న నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్-7 రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో పర్యటిస్తారు. డిసెంబర్-8న  వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. డిసెంబర్-9మెదక్ జిల్లా పర్యటనతో ప్రచారం ముగుస్తుంది. 

ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు నిర్వహించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కవర్ చేసేలా ఈ షెడ్యూల్‌ రూపొందించారు. 

Frequently Asked Questions

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏమిటి?

కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, మంత్రులకు కీలక సూచనలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో మంత్రుల పాత్ర ఏమిటి?

మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలకు వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాలి. వెనుకబడిన మున్సిపాలిటీలను గుర్తించి, పార్టీ పరిస్థితిని మెరుగుపరిచే చర్యలపై విశ్లేషణ చేయాలి.

టికెట్ దక్కని నేతలను ఎలా బుజ్జగించాలి?

టికెట్ దక్కని నేతలను బుజ్జగించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలి. పాత, కొత్త నేతల మధ్య సమన్వయం పాటిస్తూ, పార్టీ కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఏమిటి?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నల్గొండ, డిసెంబర్ 5న కరీంనగర్, డిసెంబర్ 6న నిజామాబాద్, డిసెంబర్ 7న రంగారెడ్డి, డిసెంబర్ 8న వరంగల్, డిసెంబర్ 9న మెదక్ జిల్లాల్లో పర్యటిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget