Cm Kcr On Modi: మోదీ గుజరాత్ కు మాత్రమే ప్రధాని... ఆర్బిట్రేషన్ సెంటర్ అహ్మదాబాద్ లో పెట్టాలని ఒత్తిడి... సీఎం కేసీఆర్ ఆరోపణ
హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మోదీ దేశానికి ప్రధాని కాదు గుజరాత్ ప్రధాని అని విమర్శించారు.
భారత దేశంలో చాలా కురచబుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. 'ప్రపంచం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. పెద్ద మొత్తం పెట్టుబడులు పెడుతూ వివిధ దేశాల్లో కంపెనీలు పెడుతుంటారు. ఇలాంటి కంపెనీల మధ్య కొన్నిసార్లు వివాదాలు వస్తుంటాయి. ఈ వివాదాలను కోర్టుల బయటతేల్చుకునేందుకు ఆర్బిట్రేషన్ సెంటర్లను ఆశ్రయిస్తారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో లోకాయుక్త కూడా అలాంటిదే. వివాదాలను పరిష్కరించుకునేందుకు మన దేశంలో ఇలాంటి సంస్థలు లేవు. అందుకు కంపెనీలు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇటువంటి సంస్థను భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచనల మేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం' అని సీఎం కేసీఆర్ అన్నారు.
గుజరాత్ ప్రధాని
హైదరాబాద్ గౌరవాన్ని పెంచేందుకు సీజేఐ సూచనల మేరకు అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు ఓ ప్రైవేట్ భవనాన్ని తీసుకుని రూ.15 కోట్లతో బాగుచేయించామని, ప్రతీ ఏడాది రూ.3 కోట్లు ఇస్తామని ప్రకటించామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సంస్థకు పర్మినెంట్ స్థలంలో భవనం నిర్మిస్తామన్నారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ పై ప్రధాని మోదీ హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు అహ్మదాబాద్ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ వచ్చినందుకు ప్రధాని మోదీకి నిద్రపట్టడంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మోదీ దేశానికి ప్రధాని కాదు గుజరాత్ ప్రధాని ఆరోపించారు. చాలా బాధతో ఈ మాట చెప్తున్నామన్నారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ కు పోటీగా గిఫ్ట్ సిటీలో పెడతామని బడ్జెట్ లో పెట్టారని సీఎం ఆరోపించారు.
ఆర్థిక మంత్రి ఆత్మద్రోహం చేసుకున్నారు
'కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలుగు బిడ్డను అంటారు. ఇప్పుడు ఆత్మ ద్రోహం చేసుకున్నారు. ఆర్థిక మంత్రి మాగ్ననమిటీ ఉంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడిఉంటాలి. కానీ హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ శికండిని గుజరాత్ గిఫ్ట్ సిటీలో పెడుతున్నారు.' అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని మోదీ అన్నారు. కోర్టు బయట పంచాయితీలు తేల్చుకునేందుకు వ్యవస్థను యావత్ ప్రపంచం పాటిస్తుందన్నారు. దేశంలో ఆర్బిట్రేషన్ సెంటర్లు లేవన్న కేసీఆర్.. సింగపూర్, దుబాయ్, లండన్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయన్నారు. భారత పారిశ్రామికవేత్తలు ఇతర దేశాలు వెళ్తున్నారన్నారు. సీజేఐ ఎన్వీ రమణ సూచనలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు.
గిఫ్టు సిటీలో పోటీగా మరో సెంటర్
ఈ సెంటర్‌కు ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని రూ. 15 కోట్లతో సదుపాయాలు కల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి సంవత్సరం రూ. 3 కోట్లు కేటాయిస్తామన్నారు. రూ. 300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించామన్నారు. రూ. 50 కోట్లతో బిల్డింగ్ నిర్మిస్తు్న్నామన్నారు. ఈ నెల 5న శంకుస్థాపన చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిని అహ్మదాబాద్‌లో పెట్టాలని ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.