Etela Rajender : కేసీఆర్ ను ఓడించకపోతే ఈ జన్మకు సార్థకతలేదు, 2018లోనే కుట్ర- ఈటల రాజేందర్
Etela Rajender : సీఎం కేసీఆర్ ను ఓడించకపోతే తన జన్మకు సార్థకత లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు.
Etela Rajender : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించకపోతే తన జన్మకు సార్థకత లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ బొమ్మతో తాను ఎన్నికల్లో గెలవలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం తాను తెలంగాణ ఉద్యమంలో చేరలేదన్నారు. తన సొంత పనితీరుతోనే ఎన్నికల్లో గెలిచానన్నారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించాలని కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు. మంత్రిగా ఉన్న తన ఇంట్లోనే ఎన్నికలప్పుడు తనిఖీలు చేయించారన్నారు. తనతో పాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ నేతల ఓటమికి కేసీఆర్ కుట్ర చేశారన్నారు.
సవాల్ చేస్తే బానిసలతో తిట్టిస్తారు
హుజూరాబాద్ లో తాను గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న వ్యక్తి ఇప్పటికీ రాజీనామా చేయలేదని ఈటల అన్నారు. సొంతగా ఆలోచించే వ్యక్తిని కేసీఆర్ సహించరని ఆరోపించారు. తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని సవాల్ విసిరానని, కేసీఆర్‌కు దమ్ముంటే హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలవాలని తన సవాల్ అన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తా అని సవాల్ విసిరితే బానిసలతో తిట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని పాలించే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు లేదన్నారు.
ఊపిరి పీల్చుకోవచ్చు - కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ సోకలేదు !
టచ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, నాయకులు తమతో టచ్‌లో ఉన్నారని ఈటల రాజేందర్ అన్నారు. ఈ నెల 27 తర్వాత బీజేపీలో చేరికలు మొదలవుతాయన్నారు. టీఆర్‌ఎస్ లోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరూ తనతో టచ్‌లో ఉన్నారని ఈటల అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత స్థానంలో కూర్చొబెట్టిన ఘనత ప్రధాని మోదీకి చెందుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. కేసీఆర్ అహంకారాన్ని తాను కాస్త ముందుగా ఎదిరించానని, అదే బాటలో చాలా మంది నడుస్తారన్నారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని ఈటల అన్నారు.
Also Read : KTR Happy : ఆ విద్యార్థిని విజయం వెనుక కేటీఆర్ - సాయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది !
Also Read : ఖమ్మం జిల్లాలో పట్టుసాధించేందుకు భట్టి వ్యూహం, రేవంత్ వర్గానికి చెక్ పెట్టేందుకేనా?