KTR Happy : ఆ విద్యార్థిని విజయం వెనుక కేటీఆర్ - సాయం ఎప్పటికీ నిలిచి ఉంటుంది !
నిరుపేద విద్యార్థిని చదువుకోవడానికి కేటీఆర్ సాయం చేశారు. ఇప్పుడా యువతి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగం సాధించింది.
KTR Happy : ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని చదువులో మంచి ప్రతిభ చూపింది. క్యాంపస్ ఇంటర్యూల్లో ఏకంగా ఐదు ఉద్యోగాలకు ఎంపికైంది. వాటిలో మంచి ఉద్యోగాన్ని సెలక్ట్ చేసుకుని కెరీర్ ప్రారంభిస్తుంది. అయితే ఇలాంటి విజయాలు చాలా మంది సాధిస్తారు. కానీ ఆ విద్యార్థిని మాత్రం ప్రత్యేకం. అందుకే కేటీఆర్ కూడా అభినందించారు. అభినందించడమే కాదు..తాను గర్వంగా ఫీలయ్యారు.
ఊపిరి పీల్చుకోవచ్చు - కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ సోకలేదు !
జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన రుద్ర భూమేశ్వర్ – మమతల కూతురు రచన. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో జగిత్యాలలో బాలల సదనంలో పదో తరగతి వరకు చదివింది. అప్పటి కలెక్టర్ శరత్ సహకారంతో హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో డిప్లొమా చదివి ఈ-సెట్‌లో మంచి ర్యాంక్ సాధించింది. అక్కడి నుంచి వచ్చి కథలాపూర్ మండలం తాండ్య్రాలలోని తన అక్క రమ్య ఇంట్లో రచన ఉంటున్నది. రచన ఈసెట్‌లో మంచి ర్యాంక్ సాధించిన విషయాన్ని ఆమె బావ శేఖర్ ట్విట్టర్‌లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. రచనను దత్తత తీసుకొని తన సొంత డబ్బుతో బీటెక్ చదివించారు. పట్టుదలతో కష్టపడి చదివిన రచన.. ఐదు బహుళజాతి కంపెనీల నుంచి జాబ్ ఆఫర్ లెటర్లు అందుకున్నది.
ఖమ్మం జిల్లాలో పట్టుసాధించేందుకు భట్టి వ్యూహం, రేవంత్ వర్గానికి చెక్ పెట్టేందుకేనా?
ఆమె విజయాలను కేటీఆర్ తన ట్విట్టర్ పేజీ షేర్ చేశారు. ఈ వార్త నా మనసుకు హత్తుకుంది. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న విద్యార్థిని రచన.. మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతోందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
This news warmed my heart & made my day 😊
— KTR (@KTRTRS) July 26, 2022
This bright young girl Rachana is going to soar to much greater heights 👍 pic.twitter.com/VFjRtWCkwq
ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తూంటారు. ప్రత్యేకంగా ఓ టీమ్ ఇందు కోసం పని చేస్తూ ఉంటుంది. తనకు సోషల్ మీడియాలో వచ్చిన రిక్వెస్టులను తన టీమ్‌కు రిఫర్ చేస్తూంటారు కేటీఆర్. ఇలా వందల మంది ఇప్పటికే సాయం పొందారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతెవరికి ? మమతా బెనర్జీ రూటేనా ?