Huzurabad By poll: గుర్తులతో గుబులు... దుబ్బాక సీన్ రిపీట్ అవుతుందా..?... ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఆందోళన
హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలకు ఓ చిక్కొచ్చిపడింది. భారీగా ఇండిపెంటెండ్ అభ్యర్థులు పోటీలో ఉండడం, వారికి కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీల గుర్తులను పోలి ఉండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు పోటీలో ఉండడంతో ఎన్నికల సంఘం వారందరికీ కొత్త గుర్తులను కేటాయించింది. అయితే అవి ప్రధాన పార్టీల అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో తమ ఓట్లు చీలిపోతాయని నాయకులు టెన్షన్ లో ఉన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక పోరులో ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రధాన పార్టీలని కలవరపెడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో లాగా తమను దెబ్బతీస్తారో అని ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థుల గుబులు టీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ స్వల్ప తేడాతో ఓడిపోయింది. అదే హుజూరాబాద్ ఉపఎన్నికలలో రిపీట్ అవుతుందేమోనని గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది.
Also Read: టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎన్నికకు నోటిఫికేషన్.. కేసీఆర్ తరపున మంత్రుల నామినేషన్
దుబ్బాక సీన్ రిపీట్ అయితే...
స్వతంత్ర అభ్యర్థులు చీల్చిన ఓట్ల కారణంగానే టీఆర్ఎస్ దుబ్బాకలో ఓటమిపాలైందని ఆ పార్టీ నేతలు భావించారు. ఆ ఉపఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా కేవలం 1,400 మాత్రమే. దుబ్బాక ఉపఎన్నికలలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి అత్యధికంగా 3,500 ఓట్లు వచ్చాయి. అతనితో పాటు అదే ఎన్నికల్లో పోటీ చేసిన మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు 500 నుంచి 2 వేల ఓట్ల వరకు పడ్డాయి. దీంతో ఇప్పుడు హుజూరాబాద్‌లో అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
Also Read: వామ్మో.. మందు బాబులూ.. దసరాకు ఇన్ని కోట్లు తాగారెంటయ్యా.. మద్యం ఏరులై పారిందిగా..
ఒకే లాంటి గుర్తులు
హుజూరాబాద్ బరిలో ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా ఇతరులలో 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో ఎవరో ఒకరు గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇండిపెండెట్లు ఎక్కడ తమ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారేమోనని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పైగా కారు, కమలం గుర్తులను పోలిన గుర్తులు పొందిన వారు కూడా ఈ జాబితాలో ఉండటం మరింత కలవరపెడుతోంది. వాస్తవానికి నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో బీజేపీ, టీఆర్ఎస్ కష్టపడి బుజ్జగిస్తేనే వెనక్కి తగ్గినవారు ఉన్నారు.
Also Read: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్