అన్వేషించండి

Tigers Death: పులుల మృతి కేసు, ఆదివాసీ యువకులను బలిపశువులు చేస్తున్నారా? మానవ హక్కుల వేదిక ప్రశ్నలు

Kumuram Bheem Asifabad district: దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి.

Tiger Dies in Asifabad district:: కాగజ్ నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టి.. వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులను చంపినట్టు నేరం మోపి.. వారిని రిమాండ్ కు పంపించారని ఆదివారం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ జరిపింది. 

అమాయక ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలి
ఆదివాసి యువకులైన కోవగంగు, ఆత్రం జలపతులను వెంటనే విడుదల చేయాలని, వారు ఏమైనా నేరం చేసి ఉంటే మానవతా దృక్పథంతో వ్యవహరించి వదిలివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. పులుల బారిన మనుషులు, పశువులు చనిపోకుండా ఏం రక్షణ చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. పులులను మానవ సంచారంలేని పరిమిత, నిర్దిష్ట అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి వాటిని సంరక్షించాలని కోరారు. పులుల సంరక్షణ మానవాళికి శిక్షగా మారకూడదని మానవ హక్కుల వేదిక తరపున డిమాండ్ చేశారు. ఈ నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కాంబ్లీ అతీష్, సభ్యులు ఆత్రం సాయుధ, నూతన్, మరప సురేష్ లు ఉన్నారు.

పశుగ్రాసం, ఆహారం కోసం అడవిలోకి..
వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుండి ఆదివాసీ ప్రజలు పశు సంపద, ఆహారం కోసం దరిగాం అడవికి వెళ్తారు. ఈ క్రమంలో రింగారెట్ గ్రామానికి చెందిన కోవా గంగు యొక్క ఆవు నెల రోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయింది. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో, దాని యజమాని అటవీ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే దరిగాం అడవిలో పులి చనిపోయింది అని గ్రామస్తులు సమాచారం ఇస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత మరో పులి చనిపోయింది. వారు పులులు చనిపోవటానికి పరిసర ప్రాంతాల రైతులు లేదా పశుకాపరులే కారణమై ఉంటారని అనుమానంతో ఒక 12 ఏళ్ల బాలున్ని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కోవగంగు, ఆత్రం జలపతులే పులుల మరణానికి కారణమని ఆ బాలుడితో చెప్పించారు. 

కోవగంగును, ఆత్రం జలపతితో పాటు మరి కొంత మంది ఆదివాసీ యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్టు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం దెబ్బలకు తట్టుకోలేక మాత్రమే తాము చేయని నేరాన్ని ఒప్పుకుంటున్నామని గంగు, జలపతులు చెప్పారని.. వారి బంధువులు మానవ హక్కుల వేదిక బృందానికి తెలిపారు. కోర్టులో ఈ నేరం రుజువైనా, కాకపోయినా పులుల మరణాలకు గల కారణాలనూ, అడవులలో ఆదివాసుల పరిస్థితినీ మానవీయ కోణంతో పరిశీలిస్తేనే అర్థం అవుతాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. 
పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు!
అడవులు పులులకే కాదు ఆదివాసులకు కూడా సొంతం. అడవుల్లో ఈరోజు పులులకే కాదు ఆదివాసులకు, వారి పశుసంపదకు కూడా రక్షణ లేదు. గత సంవత్సరం సిడాం భీము అనే పత్తి రైతుపై పులి దాడి చేసి చంపేసింది. కనీసం నెల రెండు నెలలకు ఒక ఆవు లేదా ఎద్దు, ఇంకా అనేక గొర్రెలు, మేకలు పులుల బారినపడి చనిపోతున్నాయి. పులుల బారిన పడి చనిపోయే గొర్రెలకు, మేకలకు పరిహారం ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదట.. మనుషులకు, ఎద్దులకు మాత్రం ప్రభుత్వం, అటవీ అధికారులు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పులులు చనిపోతే మాత్రం ఆదివాసీ ప్రజలను జైల్లకు పంపుతున్నారు. పాలకులూ.. సమాజం.. పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని, మానవీయ దృక్పథంతో ఈ విషయాన్ని చూడాలన్నారు.
 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget