తెలంగాణలో భీకర వర్షాలు- ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు- గేట్ల పైనుంచి నీటి ప్రవాహం
భూపాలపల్లి జిల్లాలో మొరంచవాగు ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దీంతో మొరంచపల్లి నీట మునిగింది. వాగు ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఊరిలోకి నీరు చేరింది.
తెలంగాణ వ్యాప్తంగా వానలు రికార్డు స్థాయిలో పడుతున్నాయి. చాలా ప్రాంతాల నీట మునిగాయి. వాగులు వంకల ప్రవాహం ధాటికి రోడ్లు రహదార్లు తెగిపోయాయి. చాలా గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీపరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.
భూపాలపల్లి జిల్లాలో మొరంచవాగు ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దీంతో మొరంచపల్లి నీట మునిగింది. వాగు ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఊరిలోకి నీరు చేరింది. దీంతో ప్రజలకు ఎత్తైన బిల్డింగ్‌లు ఎక్కి తలదాచుకుంటున్నారు. ప్రవహిస్తున్న వరద నీరు రక్షించాలని కోరుతున్న ప్రజలు రాత్రి నుంచి బిల్డింగ్‌లపై ఉంటున్న జనం
కుండపోత మెదక్, సిద్దిపేట జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. సిద్దిపేటలో 14.7 సెటీమీటర్ల వర్షం పడితే.. మెదక్‌లో 5.5 సీంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదు అయ్యాయి.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు తోడు నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుది అదే తీరుగా ఉంది. మిగతా ప్రాజెక్టుల్లోనూ వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ఆయా ప్రాజెక్టు గేట్లను ఎత్తిన అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు