అన్వేషించండి

Telangana Governor : సెక్రటేరియట్ ప్రారంభానికి పిలవకుండా అవమానించారు - తెలంగాణ సర్కార్‌పై గవర్నర్ ఆగ్రహం !

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు.

Telangana Governor :  తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా ఉన్న తనను ప్రభుత్వం కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమర్శలు గుప్పించారు.  దేశాల అధినేతలను మనం కలవచ్చు.. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాత్రం కలవలేమని విమర్శించారు. గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో నిర్వహించిన జీ 20 సన్నాహక సదస్సుల్లో  భాగంగా సీ20  సమావేశానికి  తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ  సందర్భంగా ఆమె ప్రభుత్వ ప్రోటోకాల్ తీరుపై విమర్శలు గుప్పించారు.  ప్రగతి భవన్, రాజ్ భవన్ దూరంగా ఉంటున్నాయని గవర్నర్ తమిళిసై మండిపడ్డారు.                 

భారతదేశం అన్ని రంగాల్లోని సమస్యలకు పరిష్కారం చూపిస్తోందన్నరు.  కేవలం మాటల్లో చెప్పడం కాదని, అన్ని చేతల్లో చేసి చూపిస్తున్నామని అన్నారు.  కోవిడ్ టైంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు. ఇండియాలో కొవిడ్‌తో 45లక్షల మంది చనిపోతారని ఇతర దేశాలయన్నాయని.. కానీ అన్ని దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చి మనం వారిని కాపాడామని అన్నారు. అయితే.. కొందరు చేసే పనిని మాత్రం వ్యతిరేకిస్తుంటారని కౌంటర్లు వేశారు. కొవిడ్ టైంలో తెలంగాణలో డాక్టర్లు కూడా వైరస్ భారిన పడ్డారని, తానూ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూశానని తమిళిసై చెప్పారు. ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో మనం ఎన్నో సాధించామని అన్నారు. కేవలం ప్రేమతోనే మనమంతా కొవిడ్ నుంచి ధైర్యంగా కోలుకోగలిగామన్నారు.                                            

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నేతృత్వంలో మనం ప్రపంచాన్ని లీడ్ చేస్తున్నామని పేర్కొన్నారు. నంబర్ వన్ ఎకనామిక్ పవర్‌గా ఇండియా మారుతోందని ఉద్ఘాటించారు. జీ20 ద్వారా ప్రపంచానికి ఇండియా లీడర్‌గా నిలుస్తుందన్నారు. కానీ.. కొంతమంది కేవలం మాట్లాడుతారే తప్ప, పని చేయరంటూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. స్వామి వివేకానంద ఏం చెప్పారో.. ఇప్పుడు అవన్నీ మోడి చేస్తున్నారని తెలిపారు. అందరం ప్రజల కోసమే ఉన్నామని, అందుకు తగ్గట్టు పని చేయాలని సూచించారు. అభివృద్ధి అంటే కేవలం ఒక్క ఫ్యామిలీ కోసం కాదని, అందరూ డెవలప్ అవ్వాలని అన్నారు. నాయకులు, అధికారులు, రాజ్ భవన్, అందరూ కూడా ప్రజల కోసమే ఉన్నామని వివరించారు.                       

సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్ రాలేదని.. అభివృద్ధికి అడ్డం పడుతున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంగళవారమే రాజ్ భవన్ ఓ ప్రత్యేక నోట్ విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి అసలు రాజ్ భవన్ కు ఆహ్వానమే అందలేదని స్పష్టం చేసింది. ఇవాళ నేరుగా గవర్నర్ అదే విమర్శలు చేశారు. అయితే తాము ఆహ్వానం పంపామని మంత్ర జగదీష్ రెడ్డి కానీ.. ప్రభుత్వం కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget