(Source: ECI/ABP News/ABP Majha)
Ponguleti: పొంగులేటి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం - రెండు కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లిన అధికారులు!
Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున నగదును ఈడీ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీఎస్ విషయంలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలతో సోదాలు చేసినట్లుగా చెబుతున్నారు.
Minister Ponguleti Srinivasa Reddy house : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు పెద్ద ఎత్తున నగదు లభించినట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు మొదట ఓ నోట్స్ కౌంటింగ్ మెషిన్ ను తెప్పించుకున్నారు. ఓ గంట తర్వాత మరో మెషిన్ ను తెప్పించుకున్నారు. దీంతో నగదు లెక్కబెట్టడానికి పెద్ద మొత్తంలో ఉండటంతోనే ఇలా నోట్ల కౌంటింగ్ మెషిన్లను తీసుకెళ్లారని భావిస్తున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి బడా కాంట్రాక్టర్. ఆయనకు రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్ తో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. తమ గ్రూపునకు చెందిన టీడీఎస్ కట్టకుండా.. ఎగ్గొట్టేందుక మూడు బోగస్ కంపెనీల నుంచి ఫేక్ లావాదేవీలు సృష్టించారన్న ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు పొంగులేటి కంపెనీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెబుతున్నారు. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలతో.. కేంద్ర బలగాల రక్షణతో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం పదిహేను చోట్ల సోదాలు జరుగుతుండటంతో.. రెండు రోజుల పాటు సాగవచ్చని అంచనా వేస్తున్నారు.
'ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి' - రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి హరీష్ రావు డెడ్ లైన్
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక మంత్రి కావడంతో.. ఇక్కడ ఈడీ అధికారులకు కూడా సమాచారం లేకుండా.. కేంద్ర బలగాలతో సహా ఢిల్లీ నుంచి వచ్చి .. సోదాలు చేస్తున్నారు. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి సోదాలు అంతర్గతంగా జరిగిపోతాయి. ఎలాంటి సమాచారం బయటకు ఇవ్వరు. ఈడీ నేరుగా తాము ఫలానా వారిపై దాడులు చేశామని కూడా చెప్పదు. అయితే హైదరాబాద్‌లో దాడులు చేశామని ఇంత నగదు స్వాధీనం చేసుకున్నాం.. ఇన్ని అక్రమాలను గుర్తించామని మాత్రం ప్రకటిస్తూంటారు. దాన్ని బట్టి ఎంత దొరికిందని తేలే అవకాశం ఉంది.
కొన్నాళ్ల కిందట పొంగులేటి కుమారుడు విదేశాల నుంచి అతి ఖరీదైన వాచ్‌లను స్మిగ్లింగ్ ద్వారా తెప్పించుకున్నట్లుగా చెన్నై కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాచ్‌లను తీసుకు వస్తున్న ఇద్దర్ని గుర్తించి కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారు పొంగులేటి కమారుడి పేరు చెప్పారు. ఆ వాచ్‌లకు నగదును క్రిప్టో రూపంలో చెల్లించినట్లుగా గుర్తించారు. ఈ కేసులో విచారణకు కూడా సరిగ్గా హాజరు కాలేదని తెలుస్తోంది.