Yashasvi Jaiswal Record | India vs West Indies | జైస్వాల్ సెంచరీల రికార్డు
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారీ శతకం బాదిన ఇండియన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన ఘనతలను దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో జైస్వాల్ తన కెరీర్ లో ఏడో టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 24 ఏళ్ల లోపు వయసులో ఏడవ సెంచరీ మార్కును చేరుకుని అరుదైన క్లబ్ లో చోటు దక్కించుకున్నాడు. 24 ఏళ్ల వయసులో అత్యధిక సెంచరీలు చేసిన టెస్టు బ్యాటర్లలో నాలుగో స్థానంలో నిలిచాడు. అత్యంత వేగంగా 3000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన భారత క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు.
తన కెరీర్ లో ఏడు సెంచరీలు చేసాడు ఈ యంగ్ ప్లేయర్. అందులో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం. తను అరంగేట్రం చేసినప్పటి నుంచి అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్ గా జైస్వాల్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ లో 173 పరుగులు చేసిన జైస్వాల్ మరో 27 పరుగులు సాధిస్తే కెరీర్లో ముచ్చటగా మూడో డబుల్ సెంచరీ సాధిస్తాడు. ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశం కూడా ఉంది. జైస్వాల్ నుంచి ట్రిపుల్ సెంచరీ రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.





















