India vs West Indies 2nd Test Highlights | పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్ ఇండియా
వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీ సెంచరీతో సత్తా చాటాడు. తొలిరోజు ఆటముగిసేసరికి 90 ఓవర్లలో 2 వికెట్లకు 318 పరుగులు చేసింది టీం ఇండియా.
టాస్ గెలిచిన కెప్టెన్ శుబ్మన్ గిల్.. బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్ రాహుల్ కాస్త దూకుడుగా ఆడగా, జైస్వాల్ నెమ్మదిగా ఆడాడు. 58 పరుగుల వద్ద రాహుల్.. వర్రీకన్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. సాయి సుదర్శన్, జైస్వాల్ విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.
వీరిద్దరూ చకచకా పరుగులు చేయడంతో స్కోరు బోర్డు కాస్త వేగంగానే సాగింది. ఈక్రమంలో కెరీర్ లో ఏడో సెంచరీని జైస్వాల్ పూర్తి చేసుకున్నాడు. సాయి సుదర్శన్ వికెట్ పడిన తర్వాత కూడా జైస్వాల్ మాత్రం జోరు కొనసాగిస్తూ 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. వెస్ట్ ఇండీస్ బౌలర్లలో వర్రీకన్ తప్పా మిగితా ఎవరు అంత ప్రభావం చూపలేక పొయ్యారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో కూడా వెస్ట్ ఇండీస్ బౌలింగ్ మళ్ళి డిస్సపాయింట్ చేసింది.



















