PM Modi AP tour schedule: జీఎస్టీ ర్యాలీ , శ్రీశైలం సందర్శనే కాదు ఇంకా చాలా ఉన్నాయి - 16న మోదీ టూర్ షెడ్యూల్ పూర్తి వివరాలు
Modi AP tour: 16వ తేదీన ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. పూర్తి షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు.

Prime Minister Modi AP tour on the 16th: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారు.కర్నూలు నుంచే పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మంత్రి నారా లోకేష్, అక్టోబర్ 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే 'సూపర్ GST - సూపర్ సేవింగ్స్' ప్రజా సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి మోడీ పాల్గొనే ఈ 'సూపర్ GST - సూపర్ సేవింగ్స్' సమావేశం GST సంస్కరణల ద్వారా ప్రజలకు వచ్చిన ప్రయోజనాలను వివరించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు, పోటీలు, వివరణలు ఈ సమావేశానికి ముందస్తు ప్రచారంగా పనిచేస్తున్నాయి.
ఈనెల 16వ తేదీన కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని మోదీ రానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్నారు ప్రధాని మోదీ. 16వ తేదీన ఉదయం 10:20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అనంతరం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు బయలు దేరుతారు.
అక్కడ నుంచి ఉదయం 11:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కి చేరుకుంటారు. 16వ తేదీన ఉదయం 11:45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంటలో హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు వచ్చి బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి మోడీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ప్రసంగిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు.
ఈ నెల 16న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి శ్రీశైలం పర్యటనను దృష్టిలో ఉంచుకుని, పర్యటన కమిటీ కన్వీనర్‌గా నియమించబడిన నేను, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాశేఖర్ రెడ్డి గారితో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసాను. పర్యటన ఏర్పాట్లు, భద్రతా చర్యలు మరియు సమన్వయ… pic.twitter.com/0AVCHUrVtz
— Srinivasa Reddy Reddeppagari (@ReddeppagariSVR) October 10, 2025
సమావేశానికి ముందుగా రాష్ట్రవ్యాప్తంగా 98,985 అవగాహన కార్యక్రమాలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇవి విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య స్థాపనలు, MSMEలు, రైతుల కేంద్రాల్లో నిర్వహించారు. విద్యార్థులకు 'సూపర్ GST - సూపర్ సేవింగ్స్' అనే అంశంపై నిబంధ రచన, ప్రసంగం, చిత్రకళా పోటీలు ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో 22,500 అవగాహన కార్యక్రమాలు జరిపారు. GST సంస్కరణల ప్రయోజనాలను వివరించారు. ఈ సమావేశం TDP-బీజేపీ-జనసేన మిత్ర పక్షాల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.





















