India vs West Indies Test | Shubman Gill Injury | డాక్టర్‌గా మారిన యశస్వి జైశ్వాల్
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా పూర్తిగా డామినేషన్ చూపిస్తుంది. ఓపెనర్ గా వచ్చిన యశస్వి జైస్వాల్ డబల్ సెంచరీకి దేగ్గర్లో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఒక సంఘటన జరిగింది. అది చూసిన ఫ్యాన్స్ అంతా నవ్వుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే .. 85వ ఓవర్‌లో, జైస్వాల్ లెగ్ సైడ్‌కు బాల్ ని కొట్టి రన్ కోసం పరిగెత్తాడు. పరుగు పూర్తి చేసుకున్న గిల్, అదే వేగంతో వచ్చి వెస్టిండీస్ వికెట్ కీపర్ టావిన్ ఇమలాచ్ ను బలంగా ఢీకొట్టాడు.
వెంటనే మెడికల్ టీమ్ గిల్ దెగ్గరకు వచ్చి పరీక్షించింది. సాధారణంగా తలకు దెబ్బ తగిలినప్పుడు స్పృహ ఉందో లేదో చూడడానికి చేతి వేళ్ళను పెట్టి ఎన్ని వేళ్లు అంటూ అడుగుతారు. అయితే జైస్వాల్ కూడా అదే చేసాడు. నొప్పిలో ఉన్న గిల్ ను ఇవి ఎన్ని వేళ్ళు అని సరదాగా అడిగాడు. దాంతో శుబ్మన్ గిల్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి.





















