Actor Srikanth Bharat: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు - మహాత్ముడ్ని కించపర్చడమే కారణం !
Balamuri Venkat: మహాత్మా గాంధీపై అసభ్య వ్యాఖ్యలు చేసినందున నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు.

Police complaint against actor Srikanth Bharat: జాతి పిత మహాత్మా గాంధీపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తెలుగు సినిమా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఒక కేసు నమోదయింది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన Xలో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లలో ఆగ్రహం రగిలింది.
సమాజంలో గుర్తింపు ఉంటే ఉండాల్సింది బాధ్యతా..... బలుపు కాదూ.....
— Dr.Venkat Balmoor (@VenkatBalmoor) October 11, 2025
సోషల్ మీడియాలో కొంత మంది ఫాలో అవుతున్నారంటే అది వారి అభిమానం.... మన గొప్పతనం కాదూ....
నువ్వు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా చరిత్రను తిరగరాసిన కొన్ని వ్యక్తిత్వాలకు తగు గౌరవం ఇవ్వాలి.... మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి… pic.twitter.com/SdjSZgAxZS
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా శ్రీకాంత్ అయ్యంగార్ తన X ఖాతాలో ఒక సిరీస్ వీడియోలు పోస్ట్ చేశారు. ఈ వీడియోల్లో మహాత్మా గాంధీని తీవ్రంగా విమర్శిస్తూ, "గాంధీ మహాత్మా డా? జాతి పితా?" అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఇందులో అసభ్య, అపమానకరమైన భాష ఉపయోగించి, గాంధీజీ అహింసా సిద్ధాంతం, స్వాతంత్ర్య సమరంలో పాత్రను ఎగతాళి చేశారు. ఈ వ్యాఖ్యలు గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చేసిన కృషిని, జాతి పితగా పూజించే స్థాయి దెబ్బతీస్తాయని బల్మూరి వెంకట్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియోలు వేగంగా వైరల్ అవుతూ, సోషల్ మీడియాలో విస్తృత చర్చనీయాంశంగా మారాయి.
జాతి పిత మహాత్మా గాంధీ పై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై సీసీఎస్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు,ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్. pic.twitter.com/4D4qqSSyx6
— Sarita Avula (@SaritaAvula) October 11, 2025
శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలు జాతి గౌరవానికి భంగకరమైనవిగా భావించారు. సెక్షన్ 66A (అసభ్యకర కంటెంట్), 153A (గ్రూప్‌ల మధ్య శత్రుత్వం ప్రేరేపించడం) వంటి IPC సెక్షన్‌లు, IT యాక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు.
మరో వైపు శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన అరి సినిమా పోస్టర్లను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ధియేటర్లలో చించివేశారు. . శ్రీకాంత్ కి అవకాశమిస్తే పెద్ద సినిమాలకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
గాంధీని అవమానించిన శ్రీకాంత్ అయ్యంగార్ దిష్టి బొమ్మ దగ్ధం..
— TeluguOne (@Theteluguone) October 11, 2025
శ్రీకాంత్ నటించిన అరి సినిమా పోస్టర్ల చించివేత...
శ్రీకాంత్ కి అవకాశమిస్తే పెద్ద సినిమాలకు కూడా ఇదే గతి పడుతుందంటూ హెచ్చరిక..#MahatmaGandhi #SrikanthIyengar #Ari #Gandhi #Tollywood pic.twitter.com/evaJreB8d5
శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగు సినిమాల్లో నటుడి పేరు తెచ్చుకున్నారు. తనకు కులం అక్కర్లేదని తన పేరును శ్రీకాంత్ భరత్‌గా మార్చుకున్నారు. పోలీసులకు తనపై అందుతున్న ఫిర్యాదులపై ఆయన ఇంకా స్పందించలేదు.





















