Viral News: 100 మార్కులకు పరీక్ష రాస్తే 137 మార్కులిచ్చారు - జోధ్‌పూర్ ఇంజినీరింగ్ వర్శిటీ లెక్కే వేరు !
Jodhpur engineering university: వంద మార్కులకు పరీక్ష పెడితే వంద మార్కులొస్తాయి కానీ అంత కంటే ఎక్కువ వస్తాయా?. వస్తాయని ఓ యూనివర్శిటీ నిరూపించింది.

137 marks per 100 paper Jodhpur engineering university result: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మగ్నీరామ్ బంగర్ మెమోరియల్ (MBM) యూనివర్సిటీలో రిజల్ట్ విడుదల సమయంలో తీవ్రమైన లోపం బయటపడింది. బీఈ సెకండ్ సెమిస్టర్ (మెకానికల్) పరీక్షల ఫలితాల్లో విద్యార్థులకు 100 మార్కుల్లో 137 మార్కుల వరకు ఇచ్చారు. ఈ అసాధారణ రిజల్ట్‌ను చూసి విద్యార్థులు ఆశ్చర్యానికి గురయ్యారు, సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్‌లు వైరల్ అయ్యాయి.
అక్టోబర్ 7న యూనివర్సిటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో బీఈ సెకండ్ సెమిస్టర్ (మెకానికల్ ఇంజినీరింగ్) పరీక్షల ఫలితాలు , మార్క్‌షీట్‌లను అప్‌లోడ్ చేసింది. ఈ పరీక్షల్లో సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే, ప్రాక్టికల్, సబ్జెక్టుల్లో (గరిష్ట మార్కులు 100) 103 నుంచి 137 మార్కుల వరకు ఇచ్చారు. ఈ లోపం అన్ని మార్క్‌షీట్‌లలో కనిపించడంతో విద్యార్థులు ఆశ్చర్యపోయారు.
Jodhpur engineering university awards 120 marks in 100-mark paper, sparks outrage#Jodhpur #JodhpurUniversity pic.twitter.com/r1OADEOSSx
— Tahir Kamran | طاہرکامران (@TahirBijnori) October 11, 2025
ఒక విద్యార్థి మార్క్‌షీట్‌లో ఇంజినీరింగ్ మెకానిక్స్ ల్యాబ్ సబ్జెక్టులో 100లో 137 మార్కులు, కెమిస్ట్రీ ల్యాబ్‌లో 123 మార్కులు ఇచ్చారు. మొత్తం 600 మార్కుల్లో అన్ని సబ్జెక్టుల్లో కలిసి 675 వచ్చాయి. మరొక విద్యార్థికి మెషిన్ డ్రాయింగ్ సబ్జెక్టులో 131 మార్కులు, మరికొందరికి 5 నుంచి 7 సబ్జెక్టుల్లో 100కి పైగా మార్కులు వచ్చాయి. "టాపర్ల కంటే మరింత టాప్" అయినట్లు మార్క్‌షీట్‌లు చూపించాయి.
రిజల్ట్‌ను చూసిన విద్యార్థులు మార్కులు అసాధారణంగా ఉన్నాయని తెలిసిన వెంటనే ఆశ్చర్యానికి గురయ్యారు. "ఇది సాధ్యమేనా? 100లో 137 ఎలా?" అని ప్రశ్నలు లేవనెత్తారు. చాలా మంది స్క్రీన్‌షాట్‌లు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక విద్యార్థి "యూనివర్సిటీ అడ్మిన్‌లు మ్యాథ్స్ చదవలేదా? లేదా మనకు బోనస్ మార్కులు ఇచ్చారా?" అని జోక్ చేశారు.
100 में से 120 नंबर! यह कारनामा जोधपुर की MBM इंजीनियरिंग यूनिवर्सिटी का है.
— Gaurav Dwivedi (@gauravkrdwivedi) October 9, 2025
इंजीनियरिंग के छात्रों को मार्कशीट में 100 में से 120 नंबर मिलने के बाद बवाल मचा तो विश्विद्यालय प्रशासन ने रिजल्ट ही दबा दिया.
प्रशासन ने बिना किसी स्पष्टीकरण के तुरंत वेबसाइट से परिणाम हटा दिया.… pic.twitter.com/B1LWq4Vsw9
విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగానే, కొన్ని గంటల్లో వెబ్‌సైట్ నుంచి రిజల్ట్ , మార్క్‌షీట్ లింక్‌లను తొలగించారు. "ఇది టెక్నికల్ ఎర్రర్ మాత్రమే. అప్‌లోడింగ్ సమయంలో సిస్టమ్ లోపం వల్ల మార్కులు తప్పుగా ఎంటర్ అయ్యాయి. సుమారు 800 మంది విద్యార్థుల రిజల్టుల్లో ఈ సమస్య వచ్చింది. టెక్నికల్ టీమ్‌ను ఆదేశించి, పూర్తి తనిఖీ చేసి మళ్లీ ప్రకటిస్తామని యూనివర్శిటీ చెప్పుకుంది.





















